2019 వన్డే ప్రపంచకప్‌ను సగటు భారత క్రికెట్ అభిమాని అంత త్వరగా మరిచిపోలేడు. ఈ మెగాటోర్నీ సెమీస్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా పోరాటం చేసినా.. 240 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా.. ఎంఎస్ ధోనికి ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ అన్న సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓటమి సగటు భారత క్రీడాభిమానిని మాత్రమే కాదు జట్టులోని ప్రతి ఆటగాడిని బాధించింది. అయితే.. నాటి కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ ఈ ఓటమిని తట్టుకోలేక బాత్రూమ్‌లో ఏడ్చాడని టీమ్ ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తెలిపాడు.
IND vs PAK : ఐసీసీ షాకింగ్ నిర్ణయం తీసుకుందా? ఒలింపిక్స్‌లో భారత్, పాక్ మ్యాచ్ లేనట్లే?
ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమానీ అనే పాడ్‌కాస్ట్‌లో చాహల్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. ఆ సమయంలో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురైయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు లైవ్ లో అందరూ చూశారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ చాహల్ 2019లో జరిగిన విషయాన్ని వెల్లడించాడు.
2019 వన్డే ప్రపంచకప్‌లో తాను కోహ్లీ బాత్రూమ్‌లో ఏడవడం చూసినట్లు చాహల్ తెలిపాడు. ఆ మ్యాచ్‌లో తానే చివరి బ్యాటర్‌ని అని, మైదానంలోకి వెళ్లే క్రమంలో కోహ్లీని దాటుకుంటూ వెలుతున్నప్పుడు అతడిని చూశాను. అప్పుడు అతడి కళ్లలో నీళ్లు కనిపించాయి. అతడు మాత్రమే కాదు.. దాదాపుగా జట్టులోని అందరు ఆటగాళ్ల పరిస్థితి అదే. ఇక ధోనికి ఇదే చివరి మ్యాచ్ అని చాహల్ తెలిపాడు.
ENG vs IND : వరుసగా 15వ సారి టాస్ ఓడిపోయిన భారత్.. “రవిశాస్త్రి.. నిన్ను తప్పిస్తారు చూసుకో..”
ఇక ఆ మ్యాచ్‌లో తాను ఇంకొంచెం ఉత్తమ ప్రదర్శన చేసి ఉంటే బాగుండేదని చాహల్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో చాహల్ 10 పరుగులు వేసి 63 పరుగులు ఇచ్చి కేన్ విలియమ్సన్ వికెట్ తీశాడు.