IND vs PAK : ఐసీసీ షాకింగ్ నిర్ణయం తీసుకుందా? ఒలింపిక్స్‌లో భారత్, పాక్ మ్యాచ్ లేనట్లే?
ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీలో భారత్, పాక్ తలపడితే చూడాలని ఆశించిన ఫ్యాన్స్‌కు నిరాశ తప్పేటు లేదు

No India vs Pakistan At 2028 Olympics report
ఒకటి కాదు.. రెండు కాదు.. పది కాదు.. యాభై కాదు.. వంద కాదు.. 128 సంవత్సరాల తరువాత ఒలింపిక్స్‌లో క్రికెట్ పునఃప్రవేశించనుంది. లాస్ ఏంజెలెస్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చనున్న సంగతి తెలిసిందే. 1900లో పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో తొలి, చివరి సారిగా క్రికెట్‌కు ప్రాతినిథ్యం దక్కింది.
సాధారణంగా భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. ఇరుదేశాల్లో ఉద్రికత్తల కారణంగా ఈ రెండు దేశాలు ద్వైపాక్షిక టోర్నీలు ఆడడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. కాగా.. ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీలో భారత్, పాక్ తలపడితే చూడాలని ఆశించిన ఫ్యాన్స్‌కు నిరాశ తప్పేటు లేదు. 2028 ఒలింపిక్స్‌కు పాక్ అనర్హతను ఎదుర్కొన్న అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఐసీసీ తీసుకున్న నిర్ణయం అని సమాచారం.
ENG vs IND 5th test : రెండో రోజు ఆటకు వర్షం ముప్పు ఉందా?
ఇటీవల సింగపూర్ వేదికగా ఐసీసీ వార్షిక సర్వసభ్య వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ బరిలో నిలవడానికి కావాల్సిన అర్హత మార్గాన్ని ఖరారు చేసినట్లు ది గార్డియన్ నివేదిక పేర్కొంది.
ప్రాంతీయ అర్హతతో ఒలింపిక్స్‌కు వెళ్లాలని ఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీని ప్రకారం.. ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికా ప్రాంతాల నుండి టాప్ ర్యాంక్‌లో ఉన్న జట్లు నేరుగా ఒలింపిక్స్‌కు క్వాలిపై అవుతాయి. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తుండడంతో అమెరికా ఆటోమేటిక్‌గా క్వాలిపై కానుంది.
ENG vs IND : వరుసగా 15వ సారి టాస్ ఓడిపోయిన భారత్.. “రవిశాస్త్రి.. నిన్ను తప్పిస్తారు చూసుకో..”
ఐసీసీ ర్యాంకుల ప్రకారం ఆసియా నుంచి భారత్, ఓషియానియా నుండి ఆస్ట్రేలియా, యూరప్ నుండి ఇంగ్లాండ్, ఆఫ్రికా నుంచి దక్షిణాప్రికా టాప్ ర్యాంకుల్లో ఉన్నాయి. ఆరో జట్టును ఎలా ఎంపిక చేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం టీ20ల్లో పాకిస్థాన్ 8వ ర్యాంకులో ఉంది. ఆసియా నుంచి భారత్ అగ్రస్థానంలో ఉండడంతో పాక్‌కు దారులు మూసుకుపోయినట్లే.
అయితే.. ఐసీసీ ఇంకా దీనిపై పూర్తి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఇది ప్రతిపాదన మాత్రమే. కానీ.. ఇదే ఫైనల్ నిర్ణయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.