Champions trophy 2025 : పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు భార‌త్‌కు ఐసీసీ గుడ్‌న్యూస్‌.. విజ‌యం మ‌న‌దేరా..

ఛాంపియ‌న్స్ ట్రోఫీలోని లీగ్ మ్యాచ్‌ల‌కు సంబంధించిన అంపైర్ల జాబితాను ఐసీసీ ప్ర‌క‌టించింది.

ICC Announce match officials for Champions trophy 2025 these are the umpires for ind vs pak match

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా భార‌త్‌, పాకిస్థాన్ జ‌ట్లు ఫిబ్ర‌వ‌రి 23న దుబాయ్ వేదిక‌గా త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి 2017 ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో ఎదురైన ప‌రాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని భార‌త్ భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఈ మ్యాచ్‌కు ముందు ఐసీసీ టీమ్ఇండియాకు శుభ‌వార్త అందించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన అంపైర్ల జాబితాను ప్ర‌క‌టించింది.

పాకిస్థాన్ వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి 19 నుంచి ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. మార్చి 9న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. భార‌త్ ఆడే మ్యాచ్‌లు మాత్రం దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 8 దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటుండ‌గా.. 15 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. 12 లీగ్ మ్యాచ్‌లు కాగా.. రెండు సెమీఫైన‌ల్‌, ఓ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. తాజాగా 12 లీగ్ మ్యాచ్‌ల‌కు సంబంధించిన ఐసీసీ మ్యాచ్ అఫిషియ‌ల్స్ జాబితాను అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెల్ల‌డించింది.

IPL 2025 : కోల్‌కతాలో ఫైనల్, హైదరాబాద్‌లో ప్లేఆఫ్.. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఎప్పుడంటే?

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూసే భార‌త్‌, పాకిస్థాన్ మ్యాచ్‌కు పాల్ రీఫెల్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా భాద్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. మైఖేల్ గోఫ్ టీవీ అంపైర్‌గా, ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్ ఫోర్త్‌ అంపైర్‌గా, డేవిడ్ బూన్ మ్యాచ్ రిఫరీగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

ఆ ఐరెన్ లెగ్ అంపైర్ లేడు..

టీమ్ఇండియా ఆడే మ్యాచ్‌ల‌కు సంబంధించి ఐసీసీ ప్ర‌క‌టించిన అంపైర్ల జాబితాలో ఇంగ్లాండ్‌కు చెందిన అంపైర్ రిచ‌ర్డ్ కెటిల్ బ‌రో లేడు. దీంతో భార‌త అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే టీమ్ఇండియా ఆడిన‌ నాకౌట్ మ్యాచ్‌లో కెటిల్ బ‌రో అంపైరింగ్ చేసిన మ్యాచ్‌ల్లో ఎక్కువ‌గా భార‌త జ‌ట్టు ఓడిపోయింది. 2014 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌, 2015 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ సెమీస్‌, 2016 టీ20 ప్ర‌పంక‌ప్ సెమీస్‌, 2017 ఛాంపియ‌న్స్ ట్రోఫీ పైన‌ల్‌, 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్‌, 2021 ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్స్ షిప్‌, 2023 డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌, 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌ల్లో భార‌త్ ఓడిపోయింది. దీంతో అభిమానులు అత‌డిని ఐరెన్ లెగ్ అని అంటుంటారు. పాక్‌తో మ్యాచ్‌కు అత‌డు లేక‌పోవ‌డంతో భార‌త్ ఈజీగా గెలుస్తుంద‌ని చెబుతున్నారు.

మళ్లీ కొట్టుకున్న హర్భజన్, అక్తర్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఘటన.. వీడియో వైరల్..

కాగా.. నాకౌట్ మ్యాచ్‌ల‌కు సంబంధించిన‌ అంపైర్ల జాబితాను ఐసీసీ ప్ర‌క‌టించ‌లేదు.

టీమ్ఇండియా ఆడే మ్యాచ్‌ల‌కు అంపైర్లు వీరే..

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో టీమ్ఇండియా త‌న తొలి మ్యాచ్‌ను ఫిబ్ర‌వ‌రి 20న‌ బంగ్లాదేశ్‌తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌కు అడ్రైన్ హోల్డ్‌స్టాక్, పాల్ రిఫెల్ లు ఆన్‌ఫీల్డ్ అంపైర్లు కాగా.. టీవీఅంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, నాలుగో అంపైర్ మైకేల్ గాఫ్, మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్.

న్యూజిలాండ్‌తో భార‌త్ మార్చి 2 న త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు మైకేల్ గాఫ్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ లు ఆన్ ఫీల్డ్ అంపైర్లు కాగా.. టీవీఅంపైర్ అడ్రైన్ హోల్డ్‌స్టాక్, నాలుగో అంపైర్ పాల్ రిఫెల్, మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్.

ఇక ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్‌, పాకిస్థాన్ జ‌ట్లు ఐదు సార్లు త‌ల‌ప‌డ్డాయి. ఇందులో పాకిస్థాన్ మూడు మ్యాచ్‌ల్లో గెల‌వ‌గా, భార‌త్ 2 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది.