ICC WTC final: ఫైనల్ మ్యాచ్ గెలిస్తే ఎన్ని కోట్లు వస్తాయంటే?
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మరి కొద్ది రోజుల్లో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రైజ్ మనీని ప్రకటించింది. ఇండియా.. న్యూజిలాండ్ ల మధ్య జరగనున్న మ్యాచ్ లో విజేతకు 1.6మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ వరించనుంది.

Icc Announces Prize Money For World Test Championship Final
ICC WTC final: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మరి కొద్ది రోజుల్లో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రైజ్ మనీని ప్రకటించింది. ఇండియా.. న్యూజిలాండ్ ల మధ్య జరగనున్న మ్యాచ్ లో విజేతకు 1.6మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ వరించనుంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ.117కోట్లకు పైమాటే.
విన్నర్లకు రూ.117కోట్లు వెళ్తుండగా రన్నర్లకు రూ.5కోట్ల 85లక్షల వరకూ వెళ్తుందట. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే ప్రైజ్ మనీని సమానంగా పంచుతారు. ఇండియా.. న్యూజిలాండ్ ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ సౌతాంప్టన్ వేదికగా జూన్ 18న ఆరంభం కానుంది.
ఇంగ్లాండ్ పై విజయం సాధించి 1-0ఆధిక్యంతో న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కు ఎంట్రీ సాధించింది. ప్రస్తుతం ఇండియా ఇంట్రా స్క్వాడ్ గేమ్ ను సౌతాంప్టన్ లో ప్రాక్టీస్ చేస్తుంది. శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్ లు దూకుడుగా ఆడుతూ ఫైనల్ మ్యాచ్ పై కాన్ఫిడెన్స్ పెంచుతున్నారు.
జూన్ మొదటి వారంలోనే సౌతాంప్టన్ చేరుకున్న ఇండియా టీం ఐసోలేషన్ లో ఉంటూ.. కలిసి ట్రైనింగ్ లో పాల్గొంటుంది. కివీస్ జట్టుతో పోలిస్తే.. విరాట్ సేనకు ఫేస్ అటాక్ లో కాస్త క్వాలిటీ తక్కువగానే కనిపిస్తుంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్నర్లతో కలిసి ముగ్గురు ఫేసర్లతో ఫైనల్ మ్యాచ్ కు రెడీ అవుతుంది.