ICC Mens Player of the Month for September 2025 revealed
ICC Player of the Month : సెప్టెంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అభిషేక్ వర్మ కైవసం చేసుకున్నాడు. ఆసియాకప్ 2025లో అద్భుత ప్రదర్శనలు ఇవ్వడంతో అతడు ఈ అవార్డును దక్కించుకున్నాడు.
అతడి నిలకడ, విధ్వంసకర ఇన్నింగ్స్‌ల కారణంగా ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రతిభావంతమైన ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు. సహచర ఆటగాడు కుల్దీప్ యాదవ్, జింబాబ్వేకు చెందిన బ్రియాన్ బెన్నెట్ ను అధిగమించి ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ICC Player of the Month )అవార్డును గెలుచుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది..
ఈ అవార్డును సాధించడం పట్ల అభిషేక్ శర్మ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. భారత జట్టు ఆసియాకప్ విజేతగా నిలవడంలో సాయపడిన కీలక ఇన్నింగ్స్‌లు ఆడినందుకు ఇది లభించడంతో తాను ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల నుంచి విజయాలను సాధించగల జట్టులో భాగం కావడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నాడు. జట్టు సంస్కృతి, సానుకూల మనస్తత్వాన్ని టీ20ల్లో ఇటీవల తమ జట్టు ట్రాక్ రికార్డు చూస్తేనే అర్థమవుతుందన్నాడు.
India’s rising star crowned ICC Men’s Player of the Month for September 2025 🔥
More ➡️ https://t.co/7r5gecjfwX pic.twitter.com/FWRrg1azsp
— ICC (@ICC) October 16, 2025
తనకు మద్దతు ఇచ్చిన జట్టు యాజమాన్యానికి, సహచరులందరికి ధన్యవాదాలు తెలియజేశాడు. ఇక ఈ అవార్డుకు తనను ఎంపిక చేసిన ప్యానల్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపాడు.
25 ఏళ్ల అభిషేక్ శర్మ ఆసియాకప్‌లో 7 మ్యాచ్‌ల్లో 448.85 సగటు 200 పైగా స్ట్రైక్‌రేటుతో 314 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్థశతకాలు ఉన్నాయి.