ICC ODI Rankings Rohit Sharma first virat second
ICC ODI Rankings : టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్నారు. రోహిత్ శర్మ తన అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు.
2021 ఏప్రిల్‌లో పాకిస్తాన్‌కు చెందిన బాబర్ ఆజం తన అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నప్పటి నుండి 37 ఏళ్ల కోహ్లీ అగ్రస్థానంలో లేడు. అయితే.. ఇటీవల దక్షిణాఫ్రికాపై పరుగుల వరద పారించి అగ్రస్థానానికి దగ్గరగా వచ్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రెండు శతకాలతో పాటు విశాఖ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 65 పరుగులతో అజేయంగా నిలిచాడు.
Quality performances across formats have translated into fresh gains in the latest ICC Men’s Player Rankings 💪
Read more 👇https://t.co/NePL14NTcD
— ICC (@ICC) December 10, 2025
మొత్తంగా మూడు వన్డేల్లో కోహ్లీ 302 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో రెండు స్థానాలు మెరుగుపరచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక అగ్రస్థానంలో ఉన్న రోహిత్‌కు విరాట్‌కు మధ్య కేవలం 8 రేటింగ్ పాయింట్ల అంతరం మాత్రమే ఉంది.
రోహిత్ శర్మ ఖాతాలో 781 రేటింగ్ పాయింట్లు ఉండగా విరాట్ కోహ్లీ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి. ఇక మూడో స్థానంలో డారిల్ మిచెల్ ఉండగా నాలుగో స్థానంలో ఇబ్రహీం జద్రాన్ ఉన్నాడు. వీరిద్దరు చెరో స్థానాన్ని దిగజారారు. ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడనప్పటికి కూడా శుభ్‌మన్ గిల్ ఐదో స్థానంలోనే కొనసాగుతున్నాడు.
ఐసీసీ వన్డే బ్యాటర్ల(ICC ODI Rankings ) ర్యాంకింగ్స్..
* రోహిత్ శర్మ (భారత్) – 781 రేటింగ్ పాయింట్లు
* విరాట్ కోహ్లీ (భారత్) – 773 రేటింగ్ పాయింట్లు
* డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) – 766 రేటింగ్ పాయింట్లు
* ఇబ్రహీం జద్రాన్ (అఫ్గానిస్తాన్) – 764 రేటింగ్ పాయింట్లు
* శుభ్‌మన్ గిల్ (భారత్) – 723 రేటింగ్ పాయింట్లు