×
Ad

ICC ODI Rankings : ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌.. టాప్ ర్యాంక్ కోల్పోయిన కోహ్లీ.. నంబ‌ర్ 1 బ్యాట‌ర్‌గా కివీస్ ఆట‌గాడు..

ఐసీసీ తాజాగా విడుద‌ల చేసిన వ‌న్డే ర్యాంకింగ్స్ బ్యాట‌ర్ల విభాగంలో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ (ICC ODI Rankings) త‌న అగ్ర‌స్థానాన్ని కోల్పోయాడు.

ICC ODI Rankings Virat Kohli loses No1spot

ICC ODI Rankings : ఐసీసీ తాజాగా విడుద‌ల చేసిన వ‌న్డే ర్యాంకింగ్స్ బ్యాట‌ర్ల విభాగంలో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ త‌న అగ్ర‌స్థానాన్ని కోల్పోయాడు. 795 రేటింగ్ పాయింట్ల‌తో రెండో స్థానానికి ప‌డిపోయింది.

భార‌త్‌తో వ‌న్డే సిరీస్‌లో రెండు శ‌త‌కాల‌తో పాటు ఓ అర్థ‌సెంచ‌రీ (84, 131 నాటౌట్‌, 137) తో రాణించిన న్యూజిలాండ్ స్టార్ ఆట‌గాడు డారిల్ మిచెల్ అగ్ర‌స్థానానికి చేరుకున్నాడు. అత‌డి ఖాతాలో 845 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. డారిల్, కోహ్లీల మ‌ధ్య 50 రేటింగ్ పాయింట్ల అంత‌రం ఉండ‌డం గ‌మ‌నార్హం.

SL vs ENG : ఇంగ్లాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు శ్రీలంక జ‌ట్టు ఇదే.. కెప్టెన్‌గా చ‌రిత్ అస‌లంక‌..

ఇక న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో విఫ‌ల‌మైన టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఓ స్థానం దిగ‌జారాడు. అత‌డు మూడో స్థానం నుంచి నాలుగుకు ప‌డిపోయాడు. అత‌డి ఖాతాలో 757 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 764 రేటింగ్ పాయింట్ల‌తో మూడో స్థానంలో అఫ్గానిస్తాన్ ఆట‌గాడు ఇబ్ర‌హీం జ‌ద్రాన్ నిలిచాడు. టీమ్ఇండియా వ‌న్డే కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ 723 రేటింగ్ పాయింట్ల‌తో ఐదో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

IND vs NZ : నాగ్‌పూర్‌లో భార‌త్‌కు చేదు అనుభ‌వం.. ప‌దేళ్ల ముందు న్యూజిలాండ్ చేతిలో ఎంత చిత్తుగా ఓడిపోయిందంటే?

కివీస్‌తో రెండో వ‌న్డే శ‌త‌కంతో చెల‌రేగిన టీమ్ఇండియా వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ టాప్-10లోకి ప్ర‌వేశించాడు. 670 రేటింగ్ పాయింట్ల‌తో రాహుల్ ప‌దో స్థానానికి చేరుకున్నాడు. కివీస్‌తో సిరీస్‌లో పెద్ద‌గా రాణించ‌క‌పోవ‌డంతో మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఓ స్థానం దిగ‌జారాడు. అత‌డు టాప్‌-10 నుంచి చోటు కోల్పోయాడు. 656 రేటింగ్ పాయింట్ల‌తో ప‌దకొండో స్థానానికి ప‌డిపోయాడు.