IND vs NZ : నాగ్‌పూర్‌లో భార‌త్‌కు చేదు అనుభ‌వం.. ప‌దేళ్ల ముందు న్యూజిలాండ్ చేతిలో ఎంత చిత్తుగా ఓడిపోయిందంటే?

నాగ్‌పూర్ వేదిక‌గా ప‌దేళ్ల క్రితం కివీస్‌తో (IND vs NZ) జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ చిత్తుగా ఓడిపోయింది.

IND vs NZ : నాగ్‌పూర్‌లో భార‌త్‌కు చేదు అనుభ‌వం.. ప‌దేళ్ల ముందు న్యూజిలాండ్ చేతిలో ఎంత చిత్తుగా ఓడిపోయిందంటే?

Ten years ago Team India crushing defeat to New Zealand

Updated On : January 21, 2026 / 1:51 PM IST

IND vs NZ : భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య నేటి (జ‌న‌వ‌రి 21) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మొద‌టి టీ20 మ్యాచ్‌కు నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్ భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.

కాగా.. నాగ్‌పూర్ స్టేడియంలో భార‌త్‌కు గ‌తంలో చేదు అనుభ‌వం ఉంది. ఈ స్టేడియంలో ఇప్ప‌టి వ‌ర‌కు భారత జ‌ట్టు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంద‌గా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 2016 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇదే మైదానంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ ఘోర ప‌రాజ‌యం పాలైంది.

Shafali Verma : డ‌బ్ల్యూపీఎల్‌లో షఫాలీ వ‌ర్మ అరుదైన ఘ‌న‌త.. రెండో భార‌త ప్లేయ‌ర్‌..

నాటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జ‌ట్టు 7 వికెట్ల న‌ష్టానికి 126 ప‌రుగులే చేసింది. దీంతో భార‌త్ ఈజీగా ల‌క్ష్యాన్ని ఛేదిస్తుంద‌ని అంతా భావించారు. అయితే.. అనూహ్యంగా భార‌త్ 18.1 ఓవర్ల‌లో 79 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కివీస్ స్పిన్న‌ర్లు శాంట్న‌ర్, ఇష్ సోధిలు భార‌త బ్యాట‌ర్ల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టారు. శాంట్న‌ర్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, ఇష్ సోది మూడు వికెట్లు సాధించాడు.

ఇక ప్ర‌స్తుత కివీస్ జ‌ట్టులోనూ శాంట్న‌ర్‌, ఇష్ సోదిలు ఉన్నారు. వీరితో పాటు గ్లెన్ ఫిలిప్స్‌, ర‌చిన్ ర‌వీంద్ర‌లు పార్ట్ టైమ్ స్పిన్ వేయ‌గ‌ల‌రు. ఈ నేప‌థ్యంలో కివీస్ స్పిన్న‌ర్ల‌ను భార‌త బ్యాట‌ర్లు ఎలా ఎదుర్కొంటారు అన్న దానిపై టీమ్ఇండియా విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయి.

WPL 2026 : ముంబై ఇండియ‌న్స్ పై ఘ‌న విజ‌యం.. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు షాకిచ్చిన డ‌బ్ల్యూపీఎల్ నిర్వాహ‌కులు.. భారీ జ‌రిమానా..

పిచ్‌..
నాగ్‌పూర్ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు, స్లో బౌలర్లకు స‌హ‌కారం అందిస్తూ ఉంటుంది. మ్యాచ్ సాగే కొద్ది మంచు ప్ర‌భావం కార‌ణంగా బౌల‌ర్లు బంతిపై ప‌ట్టు దొర‌క‌డం కాస్త క‌ష్టం అవుతుంది. ఈ క్ర‌మంలో టాస్ గెలిచిన జ‌ట్టు బౌలింగ్ ఎంచుకునే అవ‌కాశం ఉంది.