Shafali Verma : డబ్ల్యూపీఎల్‌లో షఫాలీ వర్మ అరుదైన ఘనత.. రెండో భారత ప్లేయర్..
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ షఫాలీ వర్మ (Shafali Verma ) అరుదైన ఘనత సాధించింది.
Shafali Verma becomes second Indian player to score 1000 runs in WPL
- షపాలీ వర్మ అరుదైన ఘనత
- డబ్ల్యూపీఎల్‌లో 1000 పరుగులు
- ఈ ఘనత సాధించిన రెండో భారత ప్లేయర్
Shafali Verma : ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ షఫాలీ వర్మ అరుదైన ఘనత సాధించింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో 1000 పరుగుల మైలురాయిని చేరుకుంది. ఈ ఘనత సాధించిన రెండో భారత ప్లేయర్‌గా, ఓవరాల్‌గా నాలుగో క్రీడాకారిణిగా రికార్డులకు ఎక్కింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో షఫాలీ ఈ ఘనత సాధించింది.
ఈ మ్యాచ్‌లో 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె ఈ ఘనత అందుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ మొత్తం 24 బంతులను ఎదుర్కొంది. 6 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసింది.
డబ్యూపీఎల్‌లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న ప్లేయర్లు వీరే..
* నాట్ స్కైవర్ బ్రంట్ – 34 మ్యాచ్‌ల్లో 1246 పరుగులు
* మెగ్ లానింగ్ – 32 మ్యాచ్‌ల్లో 1145 పరుగులు
* హర్మన్‌ప్రీత్ కౌర్ – 33 మ్యాచ్‌ల్లో 1091 పరుగులు
* షపాలీ వర్మ – 32 మ్యాచ్‌ల్లో 1014 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నాట్ సీవర్ (65 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్ (41) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో తెలుగమ్మాయి శ్రీ చరణి మూడు వికెట్లు పడగొట్టింది. మరిజేన్ కాప్ గొప్పగా బౌలింగ్ చేసింది. నాలుగు ఓవర్లు వేసి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ సాధించింది.
1⃣0⃣0⃣0⃣ runs and counting 🫡
A moment to cherish for Shafali Verma as she becomes the 4⃣th player in #TATAWPL to achieve the feat 👏
Updates▶️ https://t.co/GUiylordH6 #KhelEmotionKa | #DCvMI️ | @DelhiCapitals | @TheShafaliVerma pic.twitter.com/QJXvVJCEUq
— Women’s Premier League (WPL) (@wplt20) January 20, 2026
ఆ తరువాత 155 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్ (51 నాటౌట్), లిజెల్ లీ(46), షెఫాలి వర్మ (29) లు రాణించారు.
