IND vs NZ : నేటి నుంచే భార‌త్ వ‌ర్సెస్‌ న్యూజిలాండ్ టీ20 సిరీస్‌.. ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ఎక్క‌డంటే..? హెడ్‌-టు-హెడ్ వివ‌రాలు..

భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య (IND vs NZ ) నేటి నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

IND vs NZ : నేటి నుంచే భార‌త్ వ‌ర్సెస్‌ న్యూజిలాండ్ టీ20 సిరీస్‌.. ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ఎక్క‌డంటే..?  హెడ్‌-టు-హెడ్ వివ‌రాలు..

IND vs NZ T20 series begins from today match streaming details here

Updated On : January 21, 2026 / 11:11 AM IST
  • నేటి నుంచే భార‌త్ వ‌ర్సెస్ కివీస్ టీ20 సిరీస్‌
  • వ‌న్డే సిరీస్ గెలిచిన జోష్‌లో కివీస్‌
  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు ఇరు జ‌ట్ల‌కు ఆఖ‌రి సిరీస్‌

IND vs NZ : 15 నెల‌ల వ్య‌వ‌ధిలోనే న్యూజిలాండ్.. భార‌త గ‌డ్డ‌పై ఘ‌న విజ‌యాల‌ను సాధించింది. టెస్టు, వ‌న్డే సిరీస్‌ల‌ను గెల‌వ‌ని లోటును తీర్చుకుంది. ఈ క్ర‌మంలోనే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముంగిట మ‌రో స‌వాల్‌ను విసురుతోంది. భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య నేటి (జ‌న‌వ‌రి 21) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్‌కు నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది.

సొంత‌గ‌డ్డ‌పై టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ముంగిట భార‌త్ ఆడుతున్న చివ‌రి టీ20 సిరీస్ ఇదే. దీంతో ఈ సిరీస్‌ను కైవ‌సం చేసుకుని మెగాటోర్నీలో ఆత్మ‌విశ్వాసంతో అడుగుపెట్టాల‌ని భార‌త్ ఆరాట‌ప‌డుతోంది. సూర్య‌కుమార్ యాద‌వ్ నాయక‌త్వంలో భార‌త్ బ‌రిలోకి దిగుతోంది. తాజాగా వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న కివీస్ అదే జోష్‌లో టీ20 సిరీస్‌ను గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది.

IND vs NZ : భార‌త్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్.. ఆనందంలో టీమ్ఇండియా!

హెడ్‌-టు-హెడ్‌..
భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు 25 టీ20 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో భార‌త్ 12 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మ‌రో 10 మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలుపొందింది. మ‌రో మూడు మ్యాచ్‌లు టై అయ్యాయి. ఇక స్వ‌దేశంలో భార‌త జ‌ట్టు కివీస్‌తో 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో భార‌త్ 7 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా కివీస్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.

ఎక్క‌డ చూడొచ్చంటే..?
భార‌త్‌, న్యూజిలాండ్ టీ20 సిరీస్ హ‌క్కుల‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ క‌లిగి ఉంది. ఈ క్ర‌మంలో టీవీల్లో మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ ఛాన‌ల్‌లో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం కానున్నాయి. ఇక ఓటీటీలో అయితే.. జియో హాట్ స్టార్, వెబ్‌సైట్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.

BCCI central contracts : రోహిత్, కోహ్లీకి అగార్క‌ర్ మ‌రో షాక్‌..! బీసీసీఐ సెంట్ర‌ల్ కాంట్రాక్టులో ఏ+ గ్రేడ్ తొల‌గింపు..! బికి ప‌డిపోనున్న స్టార్ ఆట‌గాళ్లు!

పిచ్‌..
నాగ్‌పూర్ పిచ్ సాధార‌ణంగా స్పిన్న‌ర్ల‌కు అనుకూలం. రాత్రిలో మంచు ప్ర‌భావం ఉంటుంది. దీంతో బంతి పై ప‌ట్టు దొర‌క‌డం క‌ష్టం. అందుక‌నే టాస్ గెలిచిన జ‌ట్టు తొలుత బౌలింగ్ చేసే అవ‌కాశం ఉంది.

భార‌త్, కివీస్ టీ20సిరీస్‌ షెడ్యూల్ ఇదే..

* తొలి టీ20 – జ‌న‌వ‌రి 21 – నాగ్‌పూర్‌
* రెండో టీ20 – జ‌న‌వ‌రి 23 – రాయ్‌పూర్‌
* మూడో టీ20 – జ‌న‌వ‌రి 25 – గౌహతి
* నాలుగో టీ20 – జ‌న‌వ‌రి 28 – విశాఖపట్నం
* ఐదో టీ20 – జ‌న‌వ‌రి 31 – తిరువనంతపురం