IND vs NZ : భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్.. ఆనందంలో టీమ్ఇండియా!
న్యూజిలాండ్ జట్టుకు భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు (IND vs NZ )భారీ షాక్ తగిలింది.
Big blow to New Zealand star all rounder Michael Bracewell suffers injury
- బుధవారం భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్
- కివీస్ స్టార్ ఆల్‌రౌండర్ కు గాయం
- యువ పేస్ ఆల్‌రౌండర్‌కు చోటు
IND vs NZ : తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న ఆనందంలో ఉన్న న్యూజిలాండ్ జట్టుకు టీ20 సిరీస్‌కు ముందు భారీ షాక్ తగిలింది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం (జనవరి 21) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నాగ్‌పూర్ వేదికగా తొలి టీ20 మ్యాచ జరగనుంది.
అయితే.. తొలి టీ20 మ్యాచ్‌కు కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వన్డే కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ గాయంకారణంగా తొలి మూడు టీ20 మ్యాచ్‌లకు దూరం దూరం అయ్యాడు. ఈ విషయాన్ని కివీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో అతడు గాయపడినట్లు వెల్లడించింది. పిక్క గాయంతో బాధపడుతున్న అతడు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. ఇక అతడి స్థానంలో యువ పేస్ ఆల్‌రౌండర్ క్రిస్టియన్ క్లార్క్ తొలి మూడు టీ20 మ్యాచ్‌ల్లో ఆడనున్నట్లు చెప్పింది.
భారత్‌తో ఇటీవల జరిగిన వన్డే సిరీస్ ద్వారానే క్రిస్టియన్ క్లార్క్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. మూడు వన్డేల్లో 26.14 సగటుతో 7 వికెట్లు తీశాడు. ఇక దేశవాళీ టీ20 క్రికెట్‌లో అతడి ఎకానమీ 9.08గా ఉంది. 22 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడు భారత్‌తో టీ20 సిరీస్‌లో అరంగ్రేటం చేస్తాడో లేదో చూడాల్సిందే.
ఇక క్రిస్టియన్ క్లార్క్ గురించి న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. వన్డే సిరీస్‌లో అతడు తనను తాను నిరూపించుకున్నాడని చెప్పాడు. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ అద్భుతంగా రాణించాడని తెలిపాడు. ఈ క్రమంలోనే టీ20 సిరీస్ జట్టులోకి అతడి ఛాన్స్ వచ్చిందన్నాడు.
WPL 2026 : డబ్ల్యూపీఎల్‌లో ఆర్‌సీబీ జోరు.. ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన స్మృతి మంధాన సేన..
భారత్‌తో టీ20 సిరీస్‌కు నవీకరించిన న్యూజిలాండ్ జట్టు ఇదే..
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జెమీషన్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి, క్రిస్టియన్ క్లార్క్ (తొలి 3 మ్యాచ్‌లకు).
