Team India : టీమ్ఇండియాకు ఐసీసీ బిగ్ షాక్..
భారత మహిళా క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది.

భారత మహిళా క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది. భారీ జరిమానా విధించింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత మహిళా జట్టు నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. నిర్ణీత సమయానికి ఓ ఓవర్‌ను తక్కువగా వేసింది. దీంతో భారత జట్టుకు మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధించింది.
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం.. స్లోఓవర్ రేటుకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఒక్కొ ఓవర్‌కు 5 శాతం చొప్పున కోత విధిస్తారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్న ప్లేయర్లు అందరికి ఇది వర్తింస్తుంది. ఐసీసీ విధించిన జరిమానాను భారత మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఒప్పుకోవడంతో తదుపరి ఎలాంటి విచారణ ఉండదని ఐసీసీ తెలిపింది.
CSK vs PBKS : చెన్నై వర్సెస్ పంజాబ్ మ్యాచ్.. ఈ 5 మైలురాళ్లు బ్రేక్ అయ్యే ఛాన్స్..
ఆదివారం శ్రీలంక, భారత మహిళా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 39 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్ల ధాటికి 38.1 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా మూడు వికెట్లు, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు, అరుంధతి రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. శ్రీలంక బ్యాటర్లలో హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్.
అనంతరం ప్రతిక రావల్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధన (43), హర్లీన్ డియోల్ (48 నాటౌట్) లు రాణించడంతో లక్ష్యాన్ని భారత్ 29.4 ఓవర్లలో ఓ వికెట్ మాత్రమే కోల్పోయి అందుకుంది.
దక్షిణాఫ్రికాపై విజయం..
ఈ టోర్నీలో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 29) జరిగిన ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికాపై భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ ప్రతిక రావల్ (78) అర్ద సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగెజ్ (41), స్మృతి మంధన (36) లు రాణించారు.
అనంతరం 277 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 49. 2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్ స్నేహ్ రాణా 5 వికెట్లతో సపారీ పతనాన్ని శాసించింది.