CSK vs PBKS : చెన్నై వ‌ర్సెస్ పంజాబ్ మ్యాచ్‌.. ఈ 5 మైలురాళ్లు బ్రేక్ అయ్యే ఛాన్స్‌..

చెపాక్ వేదిక‌గా బుధ‌వారం పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నుంది.

CSK vs PBKS : చెన్నై వ‌ర్సెస్ పంజాబ్ మ్యాచ్‌.. ఈ 5 మైలురాళ్లు బ్రేక్ అయ్యే ఛాన్స్‌..

Courtesy BCCI

Updated On : April 30, 2025 / 12:00 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో భాగంగా బుధ‌వారం (ఏప్రిల్ 30) చెపాక్ మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సీజ‌న్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూప‌ర్ కింగ్స్ రెండు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. మ‌రో 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 4 పాయింట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ -1.302గా ఉంది. పంజాబ్‌తో జ‌రిగే మ్యాచ్‌లోనూ చెన్నై ఓడిపోతే ఆ జ‌ట్టు అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్క‌మిస్తుంది.

ఇక పంజాబ్ కింగ్స్ విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ జ‌ట్టు 9 మ్యాచ్‌లు ఆడ‌గా 5 మ్యాచ‌ల్లో గెలుపొందింది. మ‌రో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డంతో ఆ జ‌ట్టు ఖాతాలో 11 పాయింట్లు ఉన్నాయి. నెట్‌ర‌న్‌రేట్ +0.177గా ఉంది. ప్ర‌స్తుత్తం పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో ఉంది. చెన్నైతో మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తే ఆ జ‌ట్టు టాప్‌-4లోకి దూసుకువెలుతుంది.

KKR : కోచ్ చంద్ర‌కాంత్ పండిట్‌పై కోల్‌క‌తా స్టార్ ప్లేయర్ అసంతృప్తి.. భోజ‌నం విష‌యంలో గొడ‌వ‌!

కాగా.. చెన్నై, పంజాబ్ మ్యాచ్‌లో ఓ ఐదు రికార్డులు బ‌ద్దలు అయ్యే అవ‌కాశం ఉంది.. అవేంటో ఓ సారి చూద్దాం..

రెండు వికెట్లు తీస్తే..
చెన్నై ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది మ్యాచ్‌ల్లో 31.33 స‌గ‌టు 8.2 ఎకాన‌మీతో ఆరు వికెట్లు తీశాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో అత‌డు రెండు వికెట్లు తీస్తే సీఎస్‌కే త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నిలుస్తాడు. ప్ర‌స్తుతం సీఎస్‌కే త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా డ్వేన్ బ్రావో కొన‌సాగుతున్నాడు. అత‌డు 140 వికెట్ల‌ను సాధించాడు. జ‌డేజా ఇప్ప‌టి వ‌ర‌కు 139 వికెట్లను తీశాడు.

11 ఫోర్లు కొడితే..
పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 48 స‌గ‌టు, 182.27 స్ట్రైక్‌రేటుతో 288 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. కాగా.. ఐపీఎల్‌లో 300 ఫోర్ల మైలురాయిని చేరుకునేందుకు శ్రేయ‌స్ కు మ‌రో 11 ఫోర్లు అవ‌స‌రం. అత‌డు 125 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 289 ఫోర్లు, 134 సిక్స‌ర్లు కొట్టాడు.

KKR : గెలుపు జోష్‌లో ఉన్న కోల్‌క‌తాకు బిగ్ షాక్‌.. కెప్టెన్ ర‌హానేకు గాయం.. ఇప్పుడెలా ఉందంటే?

4 సిక్స‌ర్లు కొడితే..
చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 28 స‌గ‌టుతో 142.85 స్ట్రైక్‌రేటుతో 140 ప‌రుగులు సాధించాడు. ఇందులో 11 ఫోర్లు, 8 సిక్స‌ర్లు ఉన్నాయి. మ‌రో నాలుగు సిక్స‌ర్లు గ‌నుక ధోని కొడితే.. ఐపీఎల్‌లో 350 సిక్స‌ర్ల మైలురాయిని అత‌డు చేరుకుంటాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ధోని 351 ఇన్నింగ్స్‌ల్లో 346 సిక్స‌ర్లు కొట్టాడు.

5 ప‌రుగులు చేస్తే..
పంజాబ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ మార్క‌స్ స్టోయినిస్ ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 16.75 స‌గ‌టు 152.27 స్ట్రైక్‌రేటుతో 67 ప‌రుగులు సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత‌డు 6500 ప‌రుగుల మైలురాయిని చేరుకోవ‌డానికి అత‌డికి మ‌రో 5 ప‌రుగులు అవ‌స‌రం. 314 టీ20 మ్యాచ్‌ల్లో 137.43 స్ట్రైక్‌రేటుతో 6495 ప‌రుగులు చేశాడు. ఐపీఎల్ విష‌యానికి వ‌స్తే అత‌డు 2 వేల ప‌రుగుల మార్క్‌ను చేరుకునేందుకు 67 ప‌రుగుల దూరంలో ఉన్నాడు.

Vaibhav Suryavanshi : వైభ‌వ్ సూర్య‌వంశీ శ‌త‌కంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చి ప‌డిందే.. ఇప్పుడెలా?

87 ర‌న్స్‌..
చెన్నైసూప‌ర్ కింగ్స్ స్టార్ ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 27.28 స‌గ‌టు 128.18 స్ట్రైక్‌రేటుతో 191 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచ‌రీ ఉంది. ఈ కివీస్ క్రికెట‌ర్ ఐపీఎల్‌లో 500 ప‌రుగుల మార్క్ చేరుకునేందుకు 87 ప‌రుగులు అవ‌స‌రం. ఇప్ప‌టివ‌ర‌కు అత‌డు 18 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 24.29 స‌గ‌టు, 143.90 స్ట్రైక్‌రేటుతో 413 ప‌రుగులు చేశాడు.