South Africa : ఇంగ్లాండ్ పై 342 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మి.. ద‌క్షిణాఫ్రికాకు ఐసీసీ భారీ జ‌రిమానా..

ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన ద‌క్షిణాఫ్రికా(South Africa)కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది.

ICC slaps fine on South Africa following horrific 342 run defeat against England

South Africa : ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు 342 ప‌రుగుల భారీ తేడాతో ఓడిపోయింది. వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఓ జ‌ట్టు ఇంత భారీ తేడాతో ఓడిపోవ‌డం ఇదే తొలిసారి. మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ను ద‌క్షిణాఫ్రికా 2-1 తేడాతో గెలుచుకున్న‌ప్పటికి ఆఖ‌రి వ‌న్డేలో చిత్తు ఓడ‌డం ఆ జ‌ట్టును తీవ్ర నిరాశ ప‌రిచి ఉంటుంది.

అస‌లే ఘోర ఓట‌మితో బాధ‌ప‌డుతున్న ద‌క్షిణాఫ్రికాకు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. ఆ జ‌ట్టుకు జ‌రిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 5 శాతం ఫైన్ వేసింది.

Rohit sharma : అర్ధరాత్రి ఆస్పత్రికి రోహిత్ శర్మ.. ఆందోళనలో అభిమానులు.. అసలేం జరిగిందంటే..

జ‌రిమానా ఎందుకంటే..?

మూడో వ‌న్డే మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు స్లో ఓవ‌ర్ రేటును న‌మోదు చేసింది. నిర్ణీత స‌మ‌యాని క‌న్నా ఓ ఓవ‌ర్‌ను త‌క్కువ‌గా వేసింది. ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఓ జ‌ట్టు నిర్ణీత స‌మ‌యానికి క‌న్నా ఎన్ని త‌క్కువ ఓవ‌ర్లు వేస్తే.. ఒక్కొ ఓవ‌ర్‌కు ఐదు శాతం చొప్పున జ‌ట్టుకు జ‌రిమానా విధిస్తారు. ఈ లెక్క‌న.. స‌ఫారీలు ఒక్క ఓవ‌ర్‌ను త‌క్కువ‌గా వేయ‌డంతో ఐదు శాతం జ‌రిమానాను మ్యాచ్ రిఫ‌రీ జ‌వ‌గల్ శ్రీనాథ్ విధించారు.

ఇక ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బ‌వుమా కూడా త‌ప్పును, శిక్ష‌ను అంగీక‌రించ‌డంతో త‌దుప‌రి ఎలాంటి విచార‌ణ ఉండ‌దు అని ఐసీసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

సౌతాంప్టన్ వేదిక‌గా ఆదివారం ద‌క్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జ‌ట్లు మూడో వ‌న్డేలో త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 414 ప‌రుగులు చేసింది. ఇంగ్లీష్ బ్యాట‌ర్ల‌లో జాకబ్‌ బెతెల్‌ (110), జో రూట్‌ (100) లు సెంచ‌రీలు బాదారు. జోస్ బట్లర్‌ (62 నాటౌట్‌) జేమీ స్మిత్‌ (62) మెరుపు అర్థ‌శ‌త‌కాలు బాదడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది.

Asia cup 2025 : నేటి నుంచే ఆసియాక‌ప్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌ల‌ను ఎక్క‌డ చూడొచ్చంటే..?

ఆ త‌రువాత 415 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో ద‌క్షిణాఫ్రికా ఘోరంగా విఫ‌లమైంది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 20.5 ఓవ‌ర్ల‌లో 72 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో కార్బిన్ బాష్ (20), కేశ‌వ్ మ‌హారాజ్ (17), ట్రిస్టన్ స్టబ్స్(10) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో జోఫ్రా ఆర్చ‌ర్ నాలుగు వికెట్లు తీయ‌గా.. ఆదిల్ ర‌షీద్ మూడు, బ్రైడాన్ కార్స్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.