ICC Test Rankings : ఐసీసీ టెస్టు ఆల్ రౌండర్లలో జడేజా నెంబర్ వన్..!

ICC Test Rankings : ఐసీసీ లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్లలో జడేజా నెంబర్ వన్ స్థానానికి చేరాడు.

ICC Test Rankings : ఐసీసీ టెస్టు ఆల్ రౌండర్లలో జడేజా నెంబర్ వన్..!

Icc Test Rankings Ravindra Jadeja Regains Top Spot Among All Rounders

Updated On : March 23, 2022 / 10:23 PM IST

ICC Test Rankings : ఐసీసీ లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్లలో జడేజా నెంబర్ వన్ స్థానానికి చేరాడు. బుధవారం విడుదల చేసిన ఐసీసీ ఆల్‌రౌండర్ల టెస్టు ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్‌కు చెందిన జాసన్ హోల్డర్ కన్నా రవీంద్ర జడేజా టాప్ ర్యాంకులో నిలిచాడు. ఈ నెల ప్రారంభంలో మొహాలీలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో జడేజా 175 నాటౌట్, 9 వికెట్లతో నెం.1 స్థానానికి చేరుకున్నాడు. గత వారం హోల్డర్‌ తన ర్యాంకును కోల్పోయాడు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్లు మరోసారి 385 రేటింగ్ పాయింట్లతో తమ ర్యాంకులను మెరుగుపర్చుకున్నారు. జడేజాతో పాటు రవిచంద్రన్ అశ్విన్ ఆల్ రౌండర్లలో మూడవ స్థానంలో నిలిచాడు. బౌలర్ల పట్టికలో రెండవ ర్యాంకులో నిలిచాడు.

గత వారం ఆరు స్థానాలు ఎగబాకిన భారత పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా, బౌలింగ్ జాబితాలో నాల్గవ స్థానంలో స్థిరంగా ఉన్నాడు. లేటెస్ట్ బ్యాటర్ల టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత కెప్టెన్ రోహిత్ ఏడో స్థానానికి పడిపోయాడు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ వరుసగా 9, 10వ స్థానాల్లో స్థిరంగా కొనసాగుతున్నారు. కరాచీలో జరిగిన సిరీస్‌లోని రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ ప్రదర్శన చేసిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 3 స్థానాలు ఎగబాకి ర్యాంకింగ్స్ చార్టులో నెం.5కి ఎగబాకాడు. అదే మ్యాచ్‌లో బ్యాట్‌తో ఇతర స్టార్ పెర్ఫార్మర్లు మహ్మద్ రిజ్వాన్ ఉస్మాన్ ఖవాజా కూడా తమ ర్యాంకులను మెరుగుపర్చుకున్నారు.

రెండో ఇన్నింగ్స్‌లో 104 పరుగులతో అజేయంగా నిలిచిన తర్వాత డేవిడ్ వార్నర్‌తో కలిసి రిజ్వాన్ ఆరు స్థానాలు ఎగబాకి నెం.11గా నిలిచాడు. కరాచీలో 160, 44 పరుగులు చేసిన ఖవాజా 11 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. వన్డే బ్యాటర్ల జాబితాలో మాత్రం సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్.. రోహిత్ శర్మను వెనక్కు నెట్టి మూడో స్థానానికి చేరుకున్నాడు.

వీళ్లిద్దరి మధ్య కేవలం 5 రేటింగ్ పాయింట్లే తేడాగా ఉన్నాయి. మరో సౌతాఫ్రికా క్రీడాకారుడు రాసీ వాన్ డర్ డస్సెన్ రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 6 ర్యాంకుకు చేరుకున్నాడు. బౌలర్ల జాబితాలో కగిసో రబాడ 8వ ర్యాంకులో నిలిచాడు. వన్డే బౌలర్ల జాబితాలో టాప్ 10లో ఉన్న ఏకైక భారత ఆటగాడు బుమ్రా ఆరో స్థానంలో ఉన్నాడు. జింబాబ్వేకు చెందిన సీన్ విలియమ్స్‌తో కలిసి రవీంద్ర జడేజా 10వ స్థానానికి దిగజారాడు.

Read Also : ICC Awards: క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు ప్రకటించిన ఐసీసీ!