లవ్ స్టోరీస్, జంట షికార్లు ఇదంతా ఫిబ్రవరి 14వరకే. ప్రపంచం పక్కకు పడేసిన మరో ప్రత్యేకమైన రోజు ఒకటి ఉంది. అదే ‘సింగిల్ అవేర్‌నెస్ డే’. చాలామంది ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే(ప్రేమికుల రోజు)న సింగిల్‌గా మిగిలిపోయామని లేదా సింగిల్‌గానే హ్యాపీగా ఉన్నామని చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి వాళ్లకంటూ ఓ ప్రత్యేక రోజు ఉందని తెలీయక ముందే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.
అలాంటి వారి కోసం ఈ సింగిల్ అవేర్‌నెస్ డేను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ సింగిల్ కోసం పరుగుతీస్తున్న ఫొటోను పోస్టు చేసి హ్యాపీ సింగిల్స్ అవేర్‌నెస్ డే అంటూ ట్వీట్ చేసింది.
అయితే ఆ ఫొటో పెట్టడంతో నెటిజన్లంతా ఐసీసీ విమర్శలు గుప్పిస్తున్నారు. సింగిల్స్ అవేర్‌నెస్ డే కోసం సింగిల్ రన్ తీస్తున్న లెజెండ్స్ ఫొటో పెట్టడం బాగానే ఉంది. కానీ, వారిద్దరూ సింగిల్ కాదు కదా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. మరికొందరు జవాన్లపై దాడికి మేమంతా దుఖంలో ఉంటే ఇలాంటి పోస్టులు ఏంటని ఐసీసీని ప్రశ్నిస్తున్నారు.
Happy Singles Awareness Day! ??♂️?#dayafter #ValentinesDay pic.twitter.com/7U4afOUOCD
— ICC (@ICC) February 15, 2019
Also Read : TikTok పట్టించింది : టీ అమ్ముతున్న సీఎం యోగి డూప్
Also Read : వన్ నేషన్ – వన్ నెంబర్ : 112 గుర్తుపెట్టుకుంటే చాలు
Also Read : విదేశాలకు జగన్ : అనుమతిచ్చిన సీబీఐ కోర్టు
Also Read : వెరీ చీప్ : జియో 4జీ డేటా ప్లాన్ వోచర్లు ఇవే