PIC: @ICC
India vs Pakistan: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా ఇవాళ కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో 6వ మ్యాచ్ జరుగుతోంది. భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది.
భారత బ్యాటర్లలో ప్రతికా రవాల్ 31, స్మృతి మంధాన 23, హర్లీన్ డియోల్ 46, హర్మన్ ప్రీత్ కౌర్ 19, జెమిమా రాడ్రిగ్స్ 32, దీప్తి శర్మ 25, స్నేహ్ రాణా 20, రిచా ఘోష్ 35 (నాటౌట్), శ్రీ చరణి 1, క్రాంతి 8, రేణుకా సింగ్ ఠాకూర్ 0 పరుగులు చేశారు. (India vs Pakistan) దీంతో ఇండియా స్కోరు 247/10గా నమోదైంది.
పాకిస్థాన్ బౌలర్లలో డియానా బైగ్ 4, సాదియా ఇక్బాల్, ఫాతిమా సానా రెండేసి వికెట్లు తీయగా, రమిన్ ఫమీమ్, నశ్రా సాంధూ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
కాగా, అక్టోబర్ 9న ఇండియా విమెన్, సౌత్ ఆఫ్రికా విమెన్ మధ్య విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత అక్టోబరు 13న కూడా అదే స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఇండియా టీమ్ తలపడనుంది.