World Cup 2023 Tickets: వరల్డ్ కప్ మ్యాచ్‌ల టికెట్ల విక్రయ తేదీలు వచ్చేశాయ్.. దశల వారీగా భారత మ్యాచ్‌ల టికెట్లు.. తేదీలు ఇలా ..

భారత్ ఆడే వార్మప్ మ్యాచ్‌లు, వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల విక్రయ తేదీలను ఐసీసీ ప్రకటించింది.

World Cup 2023 Tickets

ICC Mans World Cup 2023 Tickets: మరికొద్దిరోజుల్లో ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 (ICC Mans World Cup 2023) ప్రారంభం కానుంది. ఇండియా (India) వేదికగా ఈ మెగా టోర్నీ జరుగుతుండగా.. తొలి మ్యాచ్ అక్టోబర్ 5న ప్రారంభమవుతుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ  ముగియనుంది. ఇటీవల ఐసీసీ (ICC) మ్యాచ్‌ల షెడ్యూల్‌నుసైతం ప్రకటించింది. తాజాగా గత షెడ్యూల్‌లో తొమ్మిది మ్యాచ్‌ల తేదీలను ఐసీసీ మార్పులు చేసింది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను అక్టోబర్ 15కు బదులుగా అక్టోబర్ 14న నిర్వహించనున్నట్లు ఐసీసీ ధృవీకరించింది. ఇలా పలు మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు జరిగాయి. మారిన మ్యాచ్‌ల ప్రకారం టికెట్ల విక్రయానికి ఐసీసీ నిర్ణయించింది.  తొలుత ఇండియా కాకుండా ఇతర దేశాల జట్ల మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు విక్రయించనున్నారు. ఆ తరువాత ఇండియా ఆడే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు విక్రయించటం జరుగుతుందని ఐసీసీ తెలిపింది. ఇందుకోసం విడివిడిగా తేదీలను ప్రకటించింది.

World Cup 2023 : వ‌ర‌ల్డ్‌క‌ప్ షెడ్యూల్‌లో మార్పులు.. భారత్ vs పాక్ మ్యాచ్‌ స‌హా 9 మ్యాచుల రీ షెడ్యూల్‌.. టికెట్లు విక్ర‌యించే తేదీలు ఇవే..

ఇండియాలో క్రికెట్ మ్యాచ్ అంటేనే క్రికెట్ అభిమానులు టికెట్ల కోసం పోటీ పడుతుంటారు. అదే, ఇండియాలో జరిగే వరల్డ్ మ్యాచ్‌లకైతే టికెట్లు దక్కించుకొనేందుకు పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో అక్టోబర్ 5నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ కప్ మ్యాచ్‌ల టికెట్ల విక్రయ తేదీల ప్రకటన‌కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నాయి. తాజా ఐసీసీ టికెట్ల విక్రయ తేదీలను ప్రకటించింది. ఆగస్టు 25న నాన్ ఇండియా వార్మప్ మ్యాచ్‌లు, నాన్ ఇండియా మ్యాచ్‌లకు సంబంధించి టికెట్లు విక్రయాలు మొదలవుతాయి. అంటే భారత్ మినహా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ (తొమ్మిది జట్లు) మ్యాచ్‌ల టికెట్లు విక్రయాలు ప్రారంభమవుతాయి.

Asia Cup 2023 Match Timings : ఆసియాక‌ప్‌లో మ్యాచులు ఎన్ని గంట‌ల‌కు మొద‌లవుతాయంటే..? పూర్తి షెడ్యూల్ ఇదే..

భారత్ ఆడే వార్మప్ మ్యాచ్‌లు, వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించి ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు విక్రయాలు జరుగుతాయి. సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను సెప్టెంబర్ 15 నుంచి విక్రయాలు చేయనున్నారు. తాజాగా రీ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 14న జరిగే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు కూడా ఆగస్టు 30 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. అయితే, మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల ప్రకటనల గురించి రెగ్యూలర్ అప్‌డేట్‌లను పొందడానికి ఆగస్టు 15 నుంచి వెబ్‌సైట్ యాక్టివ్ అవుతుందని ఐసీసీ వర్గాలు తెలిపాయి.

Hardik Pandya Trolls: హార్ధిక్ మరీ ఇంత స్వార్థమా.. తిలక్‌ వర్మ ఆఫ్ సెంచరీ మిస్.. కెప్టెన్‌పై మండిపడుతున్న నెటిజన్లు

భారత జట్టు మ్యాచ్‌ల టికెట్ల వివరాలు ..

ఆగస్టు 25న : నాన్ ఇండియా జట్లు ఆడే వార్మప్ మ్యాచ్‌లు, వరల్డ్ కప్ మ్యాచ్‌ల టికెట్ల విక్రయం ప్రారంభమవుతుంది.
ఆగస్టు 30న : గౌహతి, త్రివేండ్రంలో భారత్ వార్మప్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు విక్రయాలు ప్రారంభమవుతాయి.
ఆగస్టు 31: చెన్నై (ఆస్ట్రేలియా – ఇండియా), ఢిల్లీ (ఆఫ్ఘనిస్థాన్ – ఇండియా), పూణె ( బంగ్లాదేశ్ – ఇండియా) మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల విక్రయం ప్రారంభమవుతుంది.
సెప్టెంబర్ 1 : ధర్మశాల (న్యూజిలాండ్ – ఇండియా), లక్నో (ఇంగ్లండ్ – ఇండియా), ముంబై (శ్రీలంక – ఇండియా) మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు విక్రయం ప్రారంభమవుతుంది.
సెప్టెంబర్ 3 : అహ్మదాబాద్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు విక్రయాలు జరగనున్నాయి.
సెప్టెంబర్ 15: సెమీ ఫైనల్స్ (ముంబై, కోల్‌కతాలో), ఫైనల్ (అహ్మదాబాద్) జరిగే మ్యాచ్ ల టికెట్ల విక్రయాలు జరుగుతాయి.

ట్రెండింగ్ వార్తలు