WTC Points table : ఐదో టెస్టులో ఇంగ్లాండ్ పై విజ‌యం.. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో భార‌త అగ్ర‌స్థానం ప‌దిలం

ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ఇన్నింగ్స్ 64 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

ICC World Test Championship Points Table India Consolidate No. 1 Spo

ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ఇన్నింగ్స్ 64 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది. కాగా.. ఐదో టెస్టులో విజ‌యంతో భార‌త్ ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల ప‌ట్టిక‌లో త‌న అగ్ర‌స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకుంది. 64.51 నుంచి 68.51 కి విజ‌య‌శాతాన్ని పెంచుకుంది.

డ‌బ్ల్యూటీసీ 2023-2025 సైకిల్‌లో తాజాగా మ్యాచ్‌లో క‌లుపుకుంటే భార‌త్ ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది టెస్టులు ఆడింది. ఇందులో ఆరు మ్యాచుల్లో గెలుపొందింది. రెండు మ్యాచుల్లో ఓడిపోగా, ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. మొత్తంగా 74 పాయింట్లు టీమ్ఇండియా ఖాతాలో ఉండ‌గా విజ‌య‌శాతం 68.51గా ఉంది. డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో న్యూజిలాండ్ జ‌ట్టు రెండో స్థానంలో కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వర‌కు కివీస్ ఐదు మ్యాచులు ఆడ‌గా మూడు మ్యాచుల్లో గెలిచింది. రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. 60 విజ‌య శాతం క‌లిగి ఉంది.

IND vs ENG : అయ్యో జానీ.. కుర్రాళ్ల‌తో ఎందుకు పెట్టుకున్నావ్‌.. ఇప్పుడు చూడు ఏమైందో.. కొన్ని ప‌రుగులు చేశావ‌ని ఎగిరిప‌డుతున్నావ్‌..

ఆ త‌రువాత ఆస్ట్రేలియా (59.09), బంగ్లాదేశ్ (50), పాకిస్తాన్ (36.66) వ‌రుస‌గా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొన‌సాగుతున్నాయి. వెస్టిండీస్ (33.33) ఆరు, సౌతాఫ్రికా (25) ఏడు, ఇంగ్లాండ్ (17.5) ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ఇక ఆడిన రెండు టెస్టుల్లో ఓడిన శ్రీలంక ఆఖ‌రి స్థానంలో ఉంది.

ట్రెండింగ్ వార్తలు