Courtesy BCCI
ఐపీఎల్ ఆరంభం నుంచి కప్పు కోసం నిరీక్షిస్తున్న జట్లలో పంజాబ్, ఆర్‌సీబీ ఉన్నాయి. ఇన్నాళ్లు ఈ రెండు జట్లకు అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న ఐపీఎల్ టైటిల్ ఈ సారి ఏదో ఒక జట్టు అందుకోనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం ఆర్‌సీబీ, పంజాబ్ జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి.
మూడు సార్లు అందినట్లే అంది చేజారిన కప్పును ఈ సారి మాత్రం వదలొద్దు అనే పట్టుదలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. ఇంతకంటే గొప్ప అవకాశం మళ్లీ రాదని, కోహ్లీ చేతిలో కప్పు చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇక ఇప్పుడు ఓ సెంటిమెంట్ వర్కౌట్ అయితే.. కప్పు మాదేనని అంటున్నారు ఆర్‌సీబీ ఫ్యాన్స్. గత ఏడేళ్లుగా క్వాలిఫయర్-1లో విజేతగా నిలిచిన జట్లే ఫైనల్స్‌లోనూ గెలుపొంది కప్పును ముద్దాడాయి. ఐపీఎల్‌లో 2018 నుంచి 2024 వరకు ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది.
ఈ సీజన్‌లో పంజాబ్ ను ఓడించి క్వాలిఫయర్-1లో విజేతగా నిలిచింది ఆర్‌సీబీ. సెంటిమెంట్ వర్కౌట్ అయితే.. ఫైనల్‌లో మరోసారి పంజాబ్ ను ఓడించి ఆర్‌సీబీ కప్పును ముద్దాడడం ఖాయం అని ఫ్యాన్స్ చెబుతున్నారు.
IPL 2025 : ఐపీఎల్ ఫైనల్ పై రాజమౌళి సంచలన పోస్ట్.. అటు అయ్యర్, ఇటు కోహ్లీ.. హార్ట్ బ్రేక్..
గత ఏడు సీజన్లలో క్వాలిఫయర్-1 విజేతలు వీరే..
* 2018లో చెన్నై సూపర్ కింగ్స్
* 2019లో ముంబై ఇండియన్స్
* 2020లో ముంబై ఇండియన్స్
* 2021లో చెన్నై సూపర్ కింగ్స్
* 2022లో గుజరాత్ టైటాన్స్
* 2023లో చెన్నై సూపర్ కింగ్స్
* 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్
చూడాలి మరీ ఆర్‌సీబీ కప్పును కొడుతుందా? లేదా పంజాబ్ ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందా? అన్నది