×
Ad

Nitish Kumar Reddy : చరిత్ర సృష్టించిన నితీష్‌కుమార్ రెడ్డి.. 93 ఏళ్ల భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు..

ఆసీస్‌తో తొలి వ‌న్డే మ్యాచ్ ద్వారా టీమ్ఇండియా యువ ఆల్‌రౌండ‌ర్ నితీష్‌కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy ) అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్‌లోకి అరంగ్రేటం చేశాడు.

IND vs AUS 1st ODI Nitish Kumar Reddy Creates History On ODI Debut

Nitish Kumar Reddy : ఆసీస్‌తో తొలి వ‌న్డే మ్యాచ్ ద్వారా టీమ్ఇండియా యువ ఆల్‌రౌండ‌ర్ నితీష్‌కుమార్ రెడ్డి అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్‌లోకి అరంగ్రేటం చేశాడు. అత‌డు ఇప్ప‌టికే టీ20లు, టెస్టుల్లో భార‌త్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.

మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చేతుల మీదుగా నితీష్‌కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) వ‌న్డే క్యాప్‌ను అందుకున్నాడు. ఈ క్ర‌మంలో ఓ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. 93 ఏళ్ల భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో పెర్త్ వేదిక‌గా వ‌న్డే, టెస్టుల్లో అరంగ్రేటం చేసిన ఏకైక ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు.

Womens World Cup 2025 : వ‌ర్షం కార‌ణంగా పాక్, కివీస్‌ మ్యాచ్ ర‌ద్దు.. ద‌క్షిణాఫ్రికా ఎలా సెమీస్‌కు చేరుకుందంటే..?

2024/25 బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో పెర్త్ వేదిక‌గా జ‌రిగిన టెస్టు మ్యాచ్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లో నితీష్‌కుమార్ రెడ్డి అరంగ్రేటం చేశారు. అప్పుడు విరాట్ కోహ్లీ చేతుల మీదుగా టెస్టు క్యాచ్‌ను అందుకున్నాడు.

టీమ్ఇండియా ఆట‌గాళ్లు బరిందర్ శ్రణ్, సుబ్రోతో బెనర్జీలు పెర్త్ వేదిక‌గానే వ‌న్డేల్లో అరంగ్రేటం చేశాడు. విన‌య్‌కుమార్, హ‌ర్షిత్ రాణాలు పెర్త్ వేదిక‌గా టెస్టుల్లో అరంగ్రేటం చేశారు.

IND vs AUS : రోహిత్ అలా.. కోహ్లీ ఇలా.. గంభీర్‌కు ఛాన్స్ ఇస్తున్నారుగా.. ఇక రిటైర్‌మెంటేనా?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ ఓడిన భార‌త్ బ్యాటింగ్‌కు దిగింది. రోహిత్ శ‌ర్మ‌(8), విరాట్ కోహ్లీ (0), శుభ్‌మ‌న్ గిల్ (10)లు విఫ‌లం కావ‌డంతో 37 ప‌రుగుల‌కే మూడు కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. వ‌ర్షం కార‌ణంగా ప్ర‌స్తుతం మ్యాచ్ నిలిచిపోయింది.