IND vs AUS 1st ODI team india 136_9 in 26 overs
IND vs AUS : పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. నిర్ణీత 26 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31)లు రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్, వోవెన్, కునెమన్ తలా రెండు వికెట్లు తీశారు. స్టార్క్, ఎలిస్ చెరో వికెట్ సాధించారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆసీస్ లక్ష్యాన్ని 131గా నిర్ధారించారు.
పలు మార్లు వర్షం అడ్డంకి..
ఈ మ్యాచ్‌లో (IND vs AUS ) టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన భారత్‌కు ఆదిలో భారీ షాక్‌లు తగిలాయి. ఓపెనర్ రోహిత్ శర్మ 8 పరుగులకే ఔట్ కాగా విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. బాధ్యతాయుతంగా ఆడాల్సిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10) సైతం తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరుకోవడంతో భారత్ 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వరుణుడు పలు మార్లు ఆటంకం కలిగించాడు. ఈ మధ్యలో శ్రేయస్ అయ్యర్ (11) కూడా ఔట్ అయ్యాడు.
IND vs AUS : గిల్ నీకు ఇది తగునా? పాప్ కార్న్ కోసం ఔట్ అయ్యావా ఏంది? వీడియో
Innings Break!
Quick cameos from KL Rahul, Axar Patel and Nitish Kumar Reddy help #TeamIndia put 1⃣3⃣6⃣/9⃣ on the board 🙌
Over to our bowlers now!
Scorecard ▶ https://t.co/O1RsjJTHhM#AUSvIND pic.twitter.com/S7AfGooMya
— BCCI (@BCCI) October 19, 2025
చివరికి మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ (31)లు ధాటిగా ఆడారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. వేగంగా ఆడే క్రమంలో అక్షర్, వాషింగ్టన్ సుందర్ (10)లతో పాటు రాహుల్ ఔట్ అయ్యాడు. ఆఖరిలో నితీష్‌కుమార్ రెడ్డి (19 నాటౌట్; 11 బంతుల్లో 2 సిక్సర్లు )వేగంగా ఆడాడు.