IND vs AUS : గిల్ నీకు ఇది త‌గునా? పాప్ కార్న్ కోసం ఔట్ అయ్యావా ఏంది? వీడియో

టీమ్ఇండియా వ‌న్డే కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన గిల్ తొలి మ్యాచ్‌లో (IND vs AUS ) విఫ‌లం అయ్యాడు.

IND vs AUS : గిల్ నీకు ఇది త‌గునా? పాప్ కార్న్ కోసం ఔట్ అయ్యావా ఏంది?  వీడియో

IND vs AUS 1st ODI Gill shares popcorn with Rohit during rain break in Perth

Updated On : October 19, 2025 / 2:14 PM IST

IND vs AUS : కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి వ‌న్డేలో శుభ్‌మ‌న్ గిల్ నిరాశ‌ప‌రిచాడు. టెస్టు సార‌థ్య బాధ్య‌త‌లు అందుకున్న‌ప్పుడు అద్భుతంగా ఆడిన గిల్‌.. వ‌న్డే కెప్టెన్సీని చేప‌ట్టిన‌ తొలి మ్యాచ్‌లో విఫ‌లం అయ్యాడు. పెర్త్ వేదిక‌గా ఆసీస్‌తో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో గిల్ 18 బంతులు ఎదుర్కొన్నాడు. రెండు ఫోర్ల సాయంతో 10 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. నాథ‌న్ ఎల్లిస్ బౌలింగ్‌లో ఫిలిప్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో భార‌త్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. చాన్నాళ్ల త‌రువాత మైదానంలో అడుగుపెట్టిన రోహిత్ శ‌ర్మ 8 ప‌రుగుల‌కే ఔట్ అయ్యాడు. ఆ వెంట‌నే మ‌రో సీనియ‌ర్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ డ‌కౌట్ అయ్యాడు. దీంతో భార‌త్ 21 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

Nitish Kumar Reddy : చరిత్ర సృష్టించిన నితీష్‌కుమార్ రెడ్డి.. 93 ఏళ్ల భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు..

ఈ సమ‌యంలో కెప్టెన్ గిల్ బాధ్య‌తాయుతంగా ఆడాల్సి ఉంది. అత‌డే అత‌డు మాత్రం ఓ పేల‌వ షాట్ ఆడి వికెట్‌ను చేజేతులా అప్ప‌జెప్పాడు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవ‌ర్‌ను ఎల్లిస్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని తొలి బంతిని గిల్‌కు లెగ్ సైడ్‌గా సంధించాడు. బౌల‌ర్ ట్రాప్‌లో ప‌డ్డ‌ గిల్ డౌన్ ది లెగ్ సైడ్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. షాట్ స‌రిగ్గా క‌నెక్ట్ కాక‌పోవ‌డంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్ కీప‌ర్ దిశ‌గా వెళ్లింది.

త‌న ఎడ‌మ‌చేతి వైపు డైవ్ చేస్తూ ఫిలిప్ చ‌క్క‌ని క్యాచ్ అందుకున్నాడు. దీంతో 25 ప‌రుగుల‌కే భార‌త్ మూడు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. అయితే గిల్ ఔట‌య్యాక మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. ఇక డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన గిల్ , రోహిత్‌ శర్మతో కలిసి ఎంచ‌క్కా పాప్ కార్న్ తింటూ క‌నిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

IND vs AUS : రోహిత్ అలా.. కోహ్లీ ఇలా.. గంభీర్‌కు ఛాన్స్ ఇస్తున్నారుగా.. ఇక రిటైర్‌మెంటేనా?

దీన్ని చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొంచెం కూడా బాధ లేకుండా అలా ఎలా పాప్ కార్న్ తింటూ రిలాక్స్ అవుతున్నావు అని కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం భార‌త్ 16.4 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 52 ప‌రుగులు చేసింది. అక్ష‌ర్ ప‌టేల్ (14), కేఎల్ రాహుల్ (3) లు క్రీజులో ఉన్నారు. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్‌ను 26 ఓవ‌ర్ల‌కు కుదించారు.