IND vs AUS 2nd ODI Rohit Sharma achieves massive feat
Rohit Sharma : టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో ఆసీస్ పై 1000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో రెండో వన్డే మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు రెండు పరుగుల వద్ద హిట్‌మ్యాన్ (Rohit Sharma) ఈ ఘనత అందుకున్నాడు. రోహిత్ శర్మ తరువాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు.
IND vs AUS 2nd ODI : వరుసగా రెండో వన్డేలోనూ కోహ్లీ డకౌట్.. ఒకే ఓవర్‌లో భారత్‌కు డబుల్ షాక్..
🚨 HISTORY BY ROHIT SHARMA 🚨
Rohit Sharma becomes the first Indian batter to score 1000 runs in Australia against Australia in ODI History. 🤯 pic.twitter.com/SJizcd6yLR
— Johns. (@CricCrazyJohns) October 23, 2025
ఆసీస్ గడ్డపై వన్డేల్లో ఆస్ట్రేలియా పై అత్యధిక పరుగులు సాధించిన టీమ్ఇండియా బ్యాటర్లు వీరే..
* రోహిత్ శర్మ – 1000* రన్స్
* విరాట్ కోహ్లీ – 802 పరుగులు
* సచిన్ టెండూల్కర్ – 740 పరుగులు
* ఎంఎస్ ధోని – 684 పరుగులు
Womens World Cup 2025 : న్యూజిలాండ్‌తో చావో రేవో మ్యాచ్.. భారత్ ఆ బలహీనతను అధిగమిస్తుందా?
ఇక ఓవరాల్‌గా చూసుకుంటే ఐదో ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డులకు ఎక్కాడు. రోహిత్ కన్నా ముందు.. వివ్ రిచర్డ్స్, డెస్మండ్ హేన్స్, కుమార్ సంగక్కర, మహేల జయవర్ధనేలు ఈ ఘనత సాధించారు.