IND vs AUS : అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ ముగిసింది. టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (73; 97 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (61; 77 బంతుల్లో 7 ఫోర్లు) లు హాఫ్ సెంచరీలు చేయగా అక్షర్ పటేల్ (44; 41 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ ముందు 265 పరుగుల లక్ష్యం నిలిచింది.
భారత బ్యాటర్లలో కోహ్లీ డకౌట్ కాగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (9), కేఎల్ రాహుల్ (11), వాషింగ్టన్ సుందర్ (12), నితీశ్ కుమార్ రెడ్డి (8)లు విఫలం అయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీశాడు. జేవియర్ బార్ట్‌లెట్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్ రెండు వికెట్లు సాధించాడు.
Rohit Sharma : సెంచరీ మిస్.. అయితేనేం గంగూలీ రికార్డును మాత్రం మిస్‌కానీ రోహిత్ శర్మ..
ఆదుకున్న రోహిత్, శ్రేయస్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో తొలి బంతికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఔట్ అయ్యాడు. అదే ఓవర్‌లో ఐదో బంతికి వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ రెండు వికెట్లను జేవియర్ బార్ట్‌లెట్ పడగొట్టాడు.
ఈ దశలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ లు భుజాన వేసుకున్నారు. ఆరంభంలో ఈ జోడీ కుదురుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. కుదురుకున్నాక తమదైన శైలిలో బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమలో తొలుత రోహిత్ శర్మ, ఆ తరువాత శ్రేయస్ అయ్యర్‌లు అర్ధశతకాలు సాధించారు.
Innings Break!
A 118-run partnership between Rohit Sharma and Shreyas Iyer propels #TeamIndia to a total of 264/9.
Scorecard – https://t.co/q4oFmXx6kr #TeamIndia #AUSvIND #2ndODI pic.twitter.com/o5dN2FGhtA
— BCCI (@BCCI) October 23, 2025
అర్ధశతకం తరువాత స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో భారీ షాట్ కోసం ప్రయత్నించి రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. రోహిత్, శ్రేయస్ జోడీ మూడో వికెట్‌కు 118 పరుగులు జోడించింది. ఆ తరువాత కాసేపటికే అయ్యర్ ను ఆడమ్ జంపా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓ ఎండ్‌లో అక్షర్ పటేల్ ధాటిగా ఆడినప్పటికి మరో ఎండ్‌లో భారత్ వికెట్లు కోల్పోయింది. అక్షర్ ఔటైనా.. ఆఖరిలో హర్షిత్ రాణా (18 బంతుల్లో 24 నాటౌట్) కాస్త వేగంగా పరుగులు రాబట్టాడు.