×
Ad

IND vs AUS 3rd ODI : చెల‌రేగిన హర్షిత్ రాణా.. మూడో వ‌న్డేలో ఆసీస్ 236 ఆలౌట్..

సిడ్నీ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది.

IND vs AUS 3rd ODI Australia all out 236 team india target is 237

IND vs AUS 3rd ODI : సిడ్నీ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది. 46.4 ఓవ‌ర్ల‌లో 236 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో మాట్ రెన్షా (56; 58 బంతుల్లో 2 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. మిచెల్ మార్ష్ (41; 50 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), మాథ్యూ షార్ట్ (30) లు రాణించారు.

ట్రావిస్ హెడ్ (29), అలెక్స్ కారీ (24), కూపర్ కొన్నోలీ (23)ల‌కు మంచి ప్రారంభాలు ద‌క్కినా వాటిని భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌లేక‌పోయారు. భార‌త బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా నాలుగు వికెట్లు తీశాడు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ రెండు వికెట్లు సాధించాడు. సిరాజ్‌, ప్ర‌సిద్ద్ కృష్ణ‌, కుల్దీప్ యాద‌వ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌లు ఒక్కొ వికెట్ తీశారు.

శుభారంభం ఇచ్చిన ఓపెన‌ర్లు..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెన‌ర్లు మిచెల్ మార్ష్‌, ట్రావిస్ హెడ్ శుభారంభం ఇచ్చారు. భార‌త బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగారు. ఎడాపెడా బౌండ‌రీలు బాదుతూ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించారు. హెడ్‌ను ఔట్ చేయ‌డం ద్వారా హ‌ర్షిత్ రాణా భార‌త్‌కు తొలి వికెట్ అందించాడు. హెడ్‌-మార్ష్ జోడీ తొలి వికెట్‌కు 9.2 ఓవ‌ర్ల‌లో 61 ప‌రుగులు జోడించారు.

IND vs AUS : భార‌త్‌కు భారీ షాక్‌.. గాయంతో మైదానం వీడిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. అత‌డి స్థానంలో మ‌రొక‌రు బ్యాటింగ్ చేయొచ్చా?

ఆ త‌రువాత అర్ధ‌శ‌త‌కం దిశ‌గా సాగుతున్న మిచెల్ మార్ష్‌ను అక్ష‌ర్ ప‌టేల్ క్లీన్ బౌల్డ్ చేయ‌గా, మాథ్యూ షార్ట్‌ను వాషింగ్ట‌న్ సుంద‌ర్ పెవిలియ‌న్‌కు చేర్చాడు. దీంతో 124 ప‌రుగుల‌కే ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే బాధ్య‌త‌ను మాట్ రెన్షా, అలెక్స్ కారీలు భుజాన వేసుకున్నారు. వీరిద్ద‌రు భార‌త బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న‌ప్ప‌టికి కూడా ప‌రుగుల‌ను వేగంగా సాధించ‌లేక‌పోయారు.

IND vs AUS : ఈజీ ర‌నౌట్‌ను మిస్ చేసిన శుభ్‌మ‌న్ గిల్‌.. వీడియో వైర‌ల్‌.. ర‌విశాస్త్రి కామెంట్స్‌..

అలెక్స్ కారీని హ‌ర్షిత్ రాణా ఔట్ చేయ‌గా.. హాఫ్ సెంచ‌రీన చేసిన రెన్షాను వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఎల్బీగా ఔట్ చేశాడు. మ‌రికాసేటికే మిచెల్ ఓవెన్ ను కూడా రాణా పెవిలియ‌న్‌కు చేర్చ‌గా.. మిచెల్ స్టార్క్‌ను కుల్దీప్ ఔట్ చేయ‌డంతో 201 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయి ఆసీస్‌ క‌ష్టాల్లో ప‌డింది. ఆఖ‌రిలో నాథన్ ఎల్లిస్ (16) పోరాడ‌టంతో ఆసీస్ 230 ప‌రుగుల మార్క్‌ను దాటింది.