IND vs AUS : భారత్‌కు భారీ షాక్.. గాయంతో మైదానం వీడిన శ్రేయస్ అయ్యర్.. అతడి స్థానంలో మరొకరు బ్యాటింగ్ చేయొచ్చా?
ఆసీస్‌తో మూడో వన్డే మ్యాచ్‌లో (IND vs AUS) భారత వైస్ కెప్టెన్‌శ్రేయస్ అయ్యర్ గాయపడి మైదానాన్ని వీడాడు.
IND vs AUS 3rd ODI Injury scare for India as Shreyas Iyer walks off the field midway
IND vs AUS : సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. టీమ్ఇండియా స్టార్ ఆటగాడు, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకునే క్రమంలో అతడు గాయపడి మైదానాన్ని వీడాడు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ 34వ ఓవర్‌ను హర్షిత్ రాణా వేశాడు. ఈ ఓవర్‌లోని నాలుగో బంతికి ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కారీ (24) షాట్ ఆడగా మిస్ టైమింగ్ కావడంతో బంతి గాల్లోకి లేచింది. బ్యాక్‌వార్డ్ పాయింట్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్.. తన వెనక్కి పరిగెతుడూ డైవ్ చేస్తూ చక్కని క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి ఎడమచేయి బలంగా భూమిని తాకింది. అదే సమయంలో అతడి ఎడమమోచేయి బలంగా అతడి పక్కటెముకలపై గుచ్చుకున్నట్లుగా కనిపించింది.
IND vs AUS : ఈజీ రనౌట్‌ను మిస్ చేసిన శుభ్‌మన్ గిల్.. వీడియో వైరల్.. రవిశాస్త్రి కామెంట్స్..
A STUNNER FROM VICE CAPTAIN SHREYAS IYER. 🥶 pic.twitter.com/zY5ENqGg6D
— Johns. (@CricCrazyJohns) October 25, 2025
వెంటనే అతడు తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఫిజియో మైదానంలో వచ్చి ప్రాథమిక చికిత్స అందించాడు. అయినప్పటికి నొప్పి తగ్గకపోవడంతో అతడు మైదానాన్ని వీడాడు.
శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు రాకపోతే..
ఒకవేళ శ్రేయస్ అయ్యర్ గాయం తీవ్రమైనది అయి అతడు బ్యాటింగ్ చేయలేని పరిస్థితి ఉంటే అది భారత్‌కు ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఐసీసీ నిబంధనల ప్రకారం అతడి స్థానంలో మరో ఆటగాడు బ్యాటింగ్ చేసేందుకు వీలులేదు. అప్పుడు టీమ్ఇండియా 9 వికెట్లు కోల్పోతే ఆలౌట్‌గానే పరిగణిస్తారు. కేవలం కంకషన్ కు (తలకు దెబ్బతగిలిన సందర్భంలో) గురైన సందర్భంలో మాత్రమే ఒక ఆటగాడి స్థానంలో మరో ఆటగాడు ఆడొచ్చు.
