IND vs AUS : ఈజీ రనౌట్‌ను మిస్ చేసిన శుభ్‌మన్ గిల్.. వీడియో వైరల్.. రవిశాస్త్రి కామెంట్స్..
ఆసీస్‌తో మూడో వన్డేలో (IND vs AUS) శుభ్‌మన్ గిల్ ఈజీ రనౌట్‌ను మిస్ చేశాడు.
IND vs AUS 3rd ODI Shubman Gill Misses Easy Run Out video viral
IND vs AUS : సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో (IND vs AUS) భారత్ ఓడిపోతే ఆసీస్ వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ను మహ్మద్ సిరాజ్ వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతికి ప్రసిద్ధ్ కృష్ణ క్యాచ్ అందుకోవడంతో ట్రావిస్ హెడ్ (29) ఔట్ అయ్యాడు. దీంతో ఆసీస్ 61 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. మరో రెండు బంతులకే రెండో వికెట్ తీసే అవకాశం తృటిలో మిస్సైంది.
IND vs AUS : మూడో వన్డేలో నితీశ్ ఎందుకు ఆడడం లేదో తెలుసా? బీసీసీఐ ఏమని చెప్పిందంటే..?
Shubman Gill missed an easy run-out at the non-striker’s end. This guy can’t bat, can’t bowl, can’t field. pic.twitter.com/Gj6zEqC58J
— Srijan (@LegendDhonii) October 25, 2025
నాలుగో బంతిని మాథ్యూ షార్ట్ ఎదుర్కొన్నాడు. కవర్స్ దిశగా షాట్ ఆడాడు. అక్కడ ఉన్న ఫీల్డర్ బంతిని మిస్ చేశాడు. ఈ సమయంలో బ్యాటర్లు పరుగు తీయాలా వద్ద అన్న సందిగ్ధంలో పడిపోయారు. ఆగి మళ్లీ పరుగు ప్రారంభించారు. అదే సమయంలో బంతిని అందుకున్న గిల్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న వికెట్ల వైపు బంతిని త్రో చేశాడు. అయితే.. బంతి వికెట్లను తాకలేదు. అప్పటికి కూడా షార్ట్ క్రీజును చేరుకోలేదు.
Travis Head : ట్రావిస్ హెడ్ అరుదైన ఘనత.. వన్డేల్లో ఒకే ఒక్క ఆసీస్ ఆటగాడు..
దీన్ని చూసిన కామెంటేటర్ రవిశాస్త్రి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అది ఖచ్చితంగా రనౌట్ కావాల్సింది. గిల్ కు వికెట్లను కొట్టేందుకు కావాల్సిన సమయం దొరికింది అని అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మ్యాచ్ గెలవాలంటే ఇలాంటివి ఛాన్స్‌లు ఇవ్వొద్దంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
