IND vs AUS : మూడో వ‌న్డేలో నితీశ్ ఎందుకు ఆడ‌డం లేదో తెలుసా? బీసీసీఐ ఏమ‌ని చెప్పిందంటే..?

ఆసీస్‌తో మూడో వ‌న్డే మ్యాచ్‌లో నితీశ్‌కుమార్ రెడ్డికి (Nitish Kumar Reddy) చోటు ద‌క్క‌లేదు.

IND vs AUS : మూడో వ‌న్డేలో నితీశ్ ఎందుకు ఆడ‌డం లేదో తెలుసా?  బీసీసీఐ ఏమ‌ని చెప్పిందంటే..?

Why Nitish Kumar Reddy not playing 3rd ODI against Australia

Updated On : October 25, 2025 / 10:52 AM IST

IND vs AUS : భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య సిడ్నీ వేదిక‌గా మూడో వ‌న్డే మ్యాచ్ ప్రారంభ‌మైంది. ఈ మ్యాచ్ (IND vs AUS) తుది జ‌ట్టులో ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు ద‌క్క‌లేదు. దీంతో అత‌డికి జ‌ట్టులో ఎందుకు చోటు ద‌క్క‌లేద‌ని చాలా మందిలో సందేహం ఉంది. నితీశ్‌తో పాటు పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ కి కూడా జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. వీరిద్ద‌రి స్థానాల్లో కుల్దీప్ యాద‌వ్, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌లు వ‌చ్చారు.

వీరిలో అర్ష్‌దీప్ కు విశ్రాంతి ఇచ్చారు. అత‌డు రెండో వ‌న్డే మ్యాచ్‌లో కండ‌రాల ప‌ట్టేయ‌డంతో ఇబ్బంది ప‌డ్డాడు. అయితే.. అత‌డిది తీవ్ర‌మైన గాయం కాన‌ప్ప‌టికి కూడా టీ20 సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని అత‌డికి మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. మ‌రోవైపు నితీశ్ కుమార్ రెడ్డి గాయ‌ప‌డిన‌ట్లు బీసీసీఐ తెలిపింది.

Travis Head : ట్రావిస్ హెడ్ అరుదైన ఘ‌న‌త.. వ‌న్డేల్లో ఒకే ఒక్క ఆసీస్ ఆట‌గాడు..

అడిలైడ్ వేదికగా జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి ఎడ‌మ తొడ కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో ఇబ్బంది ప‌డ్డాడ‌ని, అందువ‌ల్లే అత‌డు మూడో టీ20 మ్యాచ్ సెల‌క్ష‌న్‌కు అందుబాటులో లేడ‌ని తెలిపింది. ఇక బీసీసీఐ వైద్య బృందం ఎప్ప‌టిక‌ప్పుడు అత‌డిని ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని చెప్పింది. దీంతో నితీశ్ టీ20 సిరీస్ ఆడ‌డం పై అనుమానాలు నెల‌కొన్నాయి. కాగా.. ఆసీస్‌తో సిరీస్‌తోనే నితీశ్ వ‌న్డేల్లో అరంగ్రేటం చేశాడు.

భార‌త తుది జ‌ట్టు..

రోహిత్ శర్మ , శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

Womens World Cup 2025 : సెమీస్ చేరుకున్న భార‌త్‌.. ప్ర‌త్య‌ర్థి ఎవ‌రో తెలుసా?

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు..

మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీప‌ర్‌), కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా , జోష్ హాజిల్‌వుడ్