AUS vs IND : ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. ఆకాశ్‌దీప్‌పై రోహిత్ శర్మ ఫైర్.. వీడియో వైరల్

ఆసీస్ బ్యాటర్ అలెక్సీ కేరీ బ్యాటింగ్ చేస్తుండగా.. 114వ ఓవర్ ను ఆకాశ్ దీప్ వేశాడు. వికెట్లకు దూరంగా బంతిని విసరడంతో ...

Rohit Sharma Akash Deep

Rohit Sharma – Akash Deep: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసింది. ఆ తరువాత టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించగా.. వరుస వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ లు తక్కువ పరుగులకే వరుసగా వికెట్లు కోల్పోయారు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది.

Also Read: IND vs AUS : ఆశలన్నీ వారిద్దరిపైనే.. ముగిసిన మూడోరోజు ఆట.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

భారత బౌలింగ్ విభాగంలో జస్ర్పీత్ బుమ్రా మినహా మిగిలిన బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. మరోవైపు నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్ లు చెరో వికెట్ పడగొట్టారు. అయితే, బౌలర్ ఆకాశ్ దీప్ పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

ఆసీస్ బ్యాటర్ అలెక్సీ కేరీ బ్యాటింగ్ చేస్తుండగా.. 114వ ఓవర్ ను ఆకాశ్ దీప్ వేశాడు. వికెట్లకు దూరంగా బంతిని విసరడంతో కీపర్ రిషబ్ పంత్ డ్రైవ్ చేసి బంతిని అందుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. ఆకాశ్ దీప్ ను ఉద్దేశిస్తూ.. ‘‘నీ బుర్రలో ఏమైనా ఉందా?’’ అనేశాడు. ఇవన్నీ స్టంప్ మైక్స్ లో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో స్టార్ స్ట్పోర్ట్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.