×
Ad

IND vs AUS 4th T20 : నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆసీస్ పై ఘ‌న విజ‌యం.. 2-1 ఆధిక్యంలోకి భార‌త్‌

ఆస్ట్రేలియాతో జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో (IND vs AUS 4th T20) భార‌త్ 48 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

IND vs AUS 4th T20 Team India won by 48 runs against australia

IND vs AUS 4th T20 : క్వీన్స్‌ల్యాండ్‌లోని కరారా ఓవల్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భార‌త్ 48 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.

168 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసీస్ 18.2 ఓవ‌ర్ల‌లో 119 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో మిచెల్ మార్ష్ (30; 24 బంతుల్లో 4 ఫోర్లు), మాథ్యూ షార్ట్ (25; 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు రాణించారు. జోష్ ఇంగ్లిష్ (12), టిమ్ డేవిడ్ (14), జోష్ ఫిలిప్ (10), గ్లెన్ మాక్స్‌వెల్ (2)లు విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అక్ష‌ర్ ప‌టేల్, శివ‌మ్ దూబెలు చెరో రెండు వికెట్లు తీశారు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అర్ష్‌దీప్ సింగ్, జ‌స్‌ప్రీత్ బుమ్రా లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Pratika Rawal : ప్ర‌తీకా రావ‌ల్ మెడ‌లో విన్నింగ్ మెడ‌ల్ ఎక్క‌డింది? ఐసీసీ ఇవ్వ‌లేదుగా.. అస‌లు విష‌యం ఇదేనా ?

అంత‌క ముందు ఈ మ్యాచ్‌లో (IND vs AUS 4th T20 ) తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 167 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో శుభ్‌మ‌న్ గిల్ (46; 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) తృటిలో హాఫ్ సెంచ‌రీని చేజార్చుకున్నాడు. అభిషేక్ శ‌ర్మ (28; 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), శివ‌మ్ దూబె (22; 18 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), సూర్య‌కుమార్ యాద‌వ్ (20; 10 బంతుల్లో 2 సిక్స‌ర్లు) ప‌ర్వాలేద‌నిపించారు.

Abhishek Sharma : అయ్యో పాపం అభిషేక్ శ‌ర్మ‌.. విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు తృటిలో మిస్‌..

ఆఖ‌రిలో అక్ష‌ర్ ప‌టేల్ (21 నాటౌట్; 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు. జితేశ్ శ‌ర్మ (3), తిల‌క్ వ‌ర్మ (5)లు విఫ‌లం అయ్యారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో ఆడ‌మ్ జంపా, నాథ‌న్ ఎల్లిస్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. జేవియర్ బార్ట్‌లెట్, మార్క‌స్ స్టోయినిస్ త‌లా ఓ వికెట్ సాధించారు.