Pratika Rawal : ప్ర‌తీకా రావ‌ల్ మెడ‌లో విన్నింగ్ మెడ‌ల్ ఎక్క‌డింది? ఐసీసీ ఇవ్వ‌లేదుగా.. అస‌లు విష‌యం ఇదేనా ?

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ ప్ర‌తీకా రావ‌ల్ (Pratika Rawal) దిగిన ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది

Pratika Rawal : ప్ర‌తీకా రావ‌ల్ మెడ‌లో విన్నింగ్ మెడ‌ల్ ఎక్క‌డింది? ఐసీసీ ఇవ్వ‌లేదుగా.. అస‌లు విష‌యం ఇదేనా ?

Pratika Rawal with the winning medal during the photoshoot with pm modi

Updated On : November 6, 2025 / 3:14 PM IST

Pratika Rawal : భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు తొలిసారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బుధ‌వారం టీమ్ఇండియా ప్లేయ‌ర్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తి ప్లేయ‌ర్‌తో ప్ర‌ధాని మోదీ స‌ర‌దాగా ముచ్చ‌టించారు. ఆ త‌రువాత ఫోటోషూట్‌ను నిర్వ‌హించారు.

అయితే.. ఈ ఫోటోల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ ప్ర‌తీకా రావ‌ల్ దిగిన ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇందులో ప్ర‌తీకా విన్నింగ్ మెడ‌ల్‌ను ధ‌రించి ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణం. వాస్త‌వానికి టీమ్ఇండియా విజేత‌గా నిలిచిన త‌రువాత నిర్వ‌హించిన ప్ర‌జెంటేష‌న్ వేడుక‌లో ప్ర‌తీక‌కు ఐసీసీ విన్నింగ్ మెడ‌ల్‌ను ఐసీసీ ఇవ్వ‌లేదు.

Abhishek Sharma : అయ్యో పాపం అభిషేక్ శ‌ర్మ‌.. విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు తృటిలో మిస్‌..

మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌కప్ 2025 టోర్న‌మెంట్‌లో ప్ర‌తీకా బాగా ఆడింది. ఏడు మ్యాచ్‌ల్లో 308 ప‌రుగులు చేసింది. అయితే.. లీగ్ ద‌శ‌లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆమె గాయ‌ప‌డింది. ఆమె స్థానంలో బీసీసీఐ షెఫాలీ వ‌ర్మ‌ను తీసుకుంది. ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం విన్నింగ్ జ‌ట్టులోని 15 మంది స‌భ్యుల‌కు మాత్ర‌మే ప‌త‌కాలు ఇస్తారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తీక‌కు విన్నింగ్ మెడ‌ల్ ఇవ్వ‌లేదు.

Hardik Pandya-Mahieka Sharma : మహికా శర్మతో బీచ్‌లో జ‌ల‌కాలాడుతున్న హార్దిక్ పాండ్యా .. 11:11 ఏంటో మ‌రీ?

కాగా.. ప్ర‌తీకా ధ‌రించిన మెడ‌ల్ ఎవ‌రిది అనే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. అయితే.. అది భారత ఆల్ రౌండర్ అమన్‌జోత్ కౌర్ ది. ఈ విష‌యం మిగిలిన ఫోటోల‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. ప్ర‌ధానితో టీమ్ మొత్తం దిగిన ఫోటోలో వెనుక వ‌రుస‌లో ఉన్న అమన్‌జోత్ కౌర్ మెడ‌లో మెడ‌ల్ లేదు. దీంతో ప్ర‌స్తుతం అమ‌న్ జోత్ కౌర్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. నిజంగా అమ‌న్ ది ఎంతో మంచి మ‌న‌సు అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.