IND vs AUS 5th T20 Abhishek Sharma created history Fastest to 1000 T20I runs by balls faced
Abhishek Sharma : టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 1000 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గబ్బా వేదికగా ఆసీస్‌తో ఐదో టీ20 మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 11 పరుగుల వద్ద అతడు ఈ ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను అధిగమించాడు.
టీ20ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 1000 పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
* అభిషేక్ శర్మ (భారత్) – 528 బంతుల్లో
* సూర్యకుమార్ యాదవ్ (భారత్) – 573 బంతుల్లో
* ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్)- 599 బంతుల్లో
* గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా)- 604 బంతుల్లో
* ఆండ్రీ రస్సెల్ (వెస్టిండీస్) – 609 బంతుల్లో
* ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) – 609 బంతుల్లో
కోహ్లీ తరువాతే..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున అత్యంత వేగంగా 1000 పరుగులు (ఇన్నింగ్స్‌ల పరంగా) సాధించిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ 27 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇక అభిషేక్ శర్మ (Abhishek Sharma ) 28 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఈ జాబితాలో ఉన్నారు.
𝘼𝙗𝙝𝙞𝙨𝙝𝙚𝙠 𝘼𝙨𝙘𝙚𝙣𝙙𝙨 🔝
1️⃣0️⃣0️⃣0️⃣ T20I runs and counting for the swashbuckling Abhishek Sharma. 👏
He also becomes the second-fastest #TeamIndia batter to achieve this feat 🔥#AUSvIND | @IamAbhiSharma4 pic.twitter.com/60OCsf5rJA
— BCCI (@BCCI) November 8, 2025
టీమ్ఇండియా తరుపున టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్లు వీరే..
* విరాట్ కోహ్లీ – 27 ఇన్నింగ్స్‌ల్లో
* అభిషేక్ శర్మ – 28 ఇన్నింగ్స్‌ల్లో
* కేఎల్ రాహుల్ – 29 ఇన్నింగ్స్‌ల్లో
* సూర్యకుమార్ యాదవ్ – 31ఇన్నింగ్స్‌ల్లో
* రోహిత్ శర్మ – 40 ఇన్నింగ్స్‌ల్లో