PIC credit @ BCCI twitter
IND vs AUS 5th Test : సిడ్నీ టెస్టులో భారత్‌కు 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో అరంగ్రేట ఆటగాడు బ్యూ వెబ్‌స్టర్ (57) హాఫ్ సెంచరీతో రాణించాడు. స్టీవ్ స్మిత్ (33), సామ్ కొన్‌స్టాస్ (23), అలెక్స్ కేరీ (21) లు ఫర్వాలేదనిపించారు. ఉస్మాన్ ఖవాజా (2), మార్నస్ లబుషేన్ (2), ట్రావిస్ హెడ్ (4) లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. జస్‌ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఓవర్ నైట్ స్కోరు వికెట్ నష్టానికి 9 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 172 పరుగులు జోడించి మిగిలిన తొమ్మిది వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు విజృంభించడంతో ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే.. అరంగ్రేట ఆటగాడు బ్యూ వెబ్‌స్టర్ ఒక్కడే భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ టెస్టుల్లో తొలి అర్థశతకాన్ని సాధించారు.
Sourav Ganguly: గంగూలీ కుమార్తె కారును ఢీకొట్టిన బస్సు.. తృటిలో తప్పిన పెనుప్రమాదం
లంచ్ తరువాత ఒక్క ఓవర్ మాత్రమే వేసిన స్టాండిన్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా మైదానాన్ని వీడాడు. స్కానింగ్ కోసం అతడు ఆస్పత్రికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. బుమ్రా గైర్హజరీలో మిగిలిన బౌలర్లు రాణించి ఆసీస్‌ను కట్టడి చేశారు. బుమ్రా గాయం పై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ అతడు మిగిలిన మ్యాచ్‌కు దూరం అయితే మాత్రం అది భారత్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్రస్తుతం ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి భారత్ సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. ఈ సమయంలో బుమ్రా సేవలు కోల్పోతే అదే విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Rohit Sharma: నేనా.. రిటైర్మెంటా..? సిడ్నీ టెస్టులో ఆడకపోవడంపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ
Tea on Day 2 in Sydney!
Mohd. Siraj with the final wicket and Australia are all out for 181 in the 1st innings.#TeamIndia with a lead of 4 runs.
Scorecard – https://t.co/NFmndHLfxu#AUSvIND pic.twitter.com/ksQazID2Do
— BCCI (@BCCI) January 4, 2025