Sourav Ganguly: గంగూలీ కుమార్తె కారును ఢీకొట్టిన బస్సు.. తృటిలో తప్పిన పెనుప్రమాదం

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కుమార్తెకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. కోల్ కతాలోని డైమండ్ హార్బర్ రోడ్డు బెహలా చౌరస్తా ప్రాంతంలో ..

Sourav Ganguly: గంగూలీ కుమార్తె కారును ఢీకొట్టిన బస్సు.. తృటిలో తప్పిన పెనుప్రమాదం

Ganguly daughter Sana

Updated On : January 4, 2025 / 9:03 AM IST

Sourav Ganguly Daughter Sana: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కుమార్తెకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. కోల్ కతాలోని డైమండ్ హార్బర్ రోడ్డు బెహలా చౌరస్తా ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం గుంగూలీ కుమార్తె సనా ప్రయాణిస్తున్న కారును బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. అయితే, బస్సు ఢీకొట్టిన సమయంలో డ్రైవర్ పక్కన సనా గంగూలీ కూర్చున్నట్లు తెలుస్తుంది.

Also Read: Rohit Sharma: నేనా.. రిటైర్మెంటా..? సిడ్నీ టెస్టులో ఆడకపోవడంపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ

బస్సు కారును ఢీకొట్టి వేగంగా ముందుకు వెళ్లిపోయింది. ఆ బస్సును గంగూలీ కారు డ్రైవర్ వెంబడించి సఖేర్ బజార్ దగ్గర అడ్డుకున్నాడు. ఇదే సమయంలో కారులో ఉన్న సనా గంగూలీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకొని డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. బస్సు ఢీకొనడంతో కారుకు స్వల్పంగా డ్యామేజ్ అయినట్లు తెలిసింది. రెండు బస్సులు ఒకదానికిఒకటి పోటీగా ముందుకెళ్తున్న క్రమంలో సనా ప్రయాణిస్తున్న కారు వాటి మధ్య చిక్కుకోగా.. ఓ బస్సు ఆమె కారును ఢీకున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Hardik Pandya – Rohit Sharma : హార్దిక్ పాండ్యా సార‌థ్యంలో ఛాంపియ‌న్స్ ట్రోఫీ బ‌రిలోకి భార‌త్‌..? వ‌న్డేల్లో కూడా రోహిత్‌కు చోటు క‌ష్ట‌మేనా?

సౌరవ్ గంగూలీ, అతని భార్య, ప్రఖ్యాత ఒడిస్సీ డ్యాన్సర్ డోనాకు ఏకైక సంతానం సనా గంగూలీ. ఆమె యూనివర్శిటీ కాలేజ్ లండన్ నుంచి ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టాను పొందింది. ప్రస్తుతం, ఆమె లండన్ కు చెందిన ఓ బోటిక్ కన్సల్టింగ్ సంస్థలో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నట్లు తెలిసింది. లండన్ లో ఉంటున్న ఆమె తన కుటుంబంతో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు కోల్ కతాకు వచ్చింది. ఆమె తండ్రి సౌరవ్ గంగూలీ బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్. అయితే, ఈ ఘటనపై గుంగూలీ కుటుంబం ఇంకా స్పందించలేదు.

గతేడాది ఆగస్టులో కోల్ కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్యకు నిరసనగా జరిగిన క్యాండిల్ లైట్ మార్చ్ లో సౌరవ్ గంగూలీ, డోనా, సనా గంగూలీ పాల్గొన్న విషయం తెలిసిందే.