IND vs AUS : కేఎల్ రాహుల్ ఔటా? నాటౌటా? థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యం పై మండిప‌డుతున్న నెటిజ‌న్లు..

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మైంది.

IND vs AUS KL Rahul fumes over controversial dismissal in Perth Test

IND vs AUS : బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన కెప్టెన్ జ‌స్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. య‌శ‌స్వి జైస్వాల్, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌లు డ‌కౌట్లు అయ్యారు. విరాట్ కోహ్లీ 5 ప‌రుగులు చేసి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. తొలి రోజు లంచ్ విరామానికి భార‌త్ 51/4 స్కోర్‌తో నిలిచింది. రిష‌బ్ పంత్‌(10), ధ్రువ్ జురెల్ (4) లు క్రీజులో ఉన్నారు.

కాగా.. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ వివాదాస్పద ఔట్ ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాశంగా మారింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ క్యాచ్ అందుకోవ‌డంతో రాహుల్ ఔటైన‌ట్లు థ‌ర్డ్ అంపైర్ ప్ర‌క‌టించాడు. 22.2వ ఓవ‌ర్‌లో మిచెల్ స్టార్క్ గుడ్ లెంగ్త్‌లో బాల్ వేశాడు. బంతిని రాహుల్ ఢిఫెన్స్ ఆడేందుకు ప్ర‌య‌త్నించ‌గా బాల్ కీప‌ర్ చేతుల్లోకి వెళ్లింది. ఆసీస్ ఆట‌గాళ్లు ఔట్ అంటూ అప్పీల్ చేయ‌గా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.

IND vs AUS : బంతిని ఆడాలా వ‌ద్దా అన్న అయోమ‌యంలో ఔటైన కోహ్లీ!.. పేల‌వ ఫామ్‌ కంటిన్యూ..

ఆసీస్ రివ్య్వూ కోరింది. రిప్లేలో బంతి బ్యాట్‌ను దాటిన త‌రువాత స్పైక్ క‌నిపించింది. ఆ స‌మ‌యంలో బ్యాట్ బ్యాడ్‌ను తాకిన‌ట్లుగా ఉంది. బంతి బ్యాట్‌ను తాకిన‌ప్పుడు శ‌బ్ధం వ‌చ్చిందా? లేదంటే బ్యాట్ ప్యాడ్‌ను తగిలిన‌ప్పుడు వ‌చ్చిందా అన్న‌దానిపై స్ప‌ష్ట‌త లేదు. ఫ్రంట్ ఆన్ యాంగిల్ అందుబాటులో లేక‌పోయింది. అదే స‌మ‌యంలో సైడ్ ఆన్ రిప్లేలో స్ప‌ష్ట‌త లేన‌ప్ప‌టికి థ‌ర్డ్ అంపైర్ రాహుల్ ను ఔట్ అని ప్ర‌క‌టించాడు.

థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యంతో కేఎల్ రాహుల్ ఆశ్చ‌ర్య‌పోయాడు. తాను నాటౌట్ అన్న‌ట్లుగా త‌ల ఊపుతూ నిరాశ‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు రెండుగా విడిపోయారు. కొంద‌రు రాహుల్ ఔట్ అంటుంటే మ‌రికొంద‌రు కాద‌ని అంటున్నారు. మ‌రీ మీకు ఏమ‌ని అనిపిస్తుందో చెప్పండి.

Virender Sehwag : వీరేంద్ర‌ సెహ్వాగ్ కొడుకు డబుల్ సెంచరీ.. 34 ఫోర్లు, 2 సిక్స‌ర్లు.. తండ్రిబాట‌లోనే..!

ఈ మ్యాచ్‌లో ఓపెన‌ర్‌గా వ‌చ్చిన రాహుల్ 74 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు బాది 26 ప‌రుగులు చేశాడు.