IND vs AUS : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. అటు ద్ర‌విడ్‌, ఇటు పాంటింగ్ రికార్డులు బ్రేక్‌..

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ చ‌రిత్ర సృష్టించాడు.

Virat Kohli creates history surpasses Rahul Dravid

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. దుబాయ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు అందుకోవ‌డం ద్వారా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి) అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న భార‌త ఆట‌గాడిగా కోహ్లీ చ‌రిత్ర సృష్టించాడు. ఈ క్ర‌మంలో దిగ్గ‌జ ఆట‌గాడు రాహుల్ ద్ర‌విడ్ రికార్డును అధిగ‌మించాడు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రాహుల్ ద్ర‌విడ్ మొత్తం 335 క్యాచ్‌లు అందుకున్నాడు. ఆసీస్ మ్యాచ్‌తో క‌లిపి కోహ్లీ 335 క్యాచ్‌తో ద్ర‌విడ్ రికార్డును బ్రేక్ చేశాడు. మ‌రే భార‌త ఆట‌గాడు కూడా 300 పైగా క్యాచ్‌ల‌ను అందుకోలేదు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న భార‌త ఆట‌గాళ్లు..

విరాట్ కోహ్లీ – 335 క్యాచ్‌లు
రాహుల్ ద్ర‌విడ్ – 334 క్యాచ్‌లు
అజారుద్దీన్ – 261 క్యాచ్‌లు
స‌చిన్ టెండూల్క‌ర్ – 256 క్యాచ్‌లు
రోహిత్ శ‌ర్మ – 223 క్యాచ్‌లు

IND vs AUS : కుల్దీప్ యాద‌వ్ పై రోహిత్, విరాట్ కోహ్లీ ఆగ్ర‌హం.. వామ్మో కింగ్‌ నోటి నుంచి అంత పెద్ద మాట‌..

ఇక ఓవ‌రాల్‌గా చూసుకుంటే అంత‌ర్జాతీయ క్రికెట్ రికీ పాంటింగ్ (364), మ‌హేలా జ‌య‌వ‌ర్థ‌నే (440), రాస్ టేల‌ర్ (351)లు మాత్ర‌మే కోహ్లీ క‌న్నా ఎక్కువ క్యాచ్‌లు అందుకున్నారు.

వ‌న్డేల్లో రెండో ఆట‌గాడిగా..

ఇక వ‌న్డేల్లో ఔట్‌ఫీల్డర్‌గా అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న ఆట‌గాళ్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు ఆసీస్ దిగ్గ‌జ ఆట‌గాడు రికీ పాంటింగ్ ను అధిగ‌మించాడు. 372 ఇన్నింగ్స్‌ల్లో పాంటింగ్ 160 క్యాచ్‌లు అందుకోగా, కోహ్లీ కేవ‌లం 298 ఇన్నింగ్స్‌ల్లోనే 161 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ జాబితాలో 218 క్యాచ్‌ల‌తో శ్రీలంక ఆట‌గాడు మ‌హేలా జ‌య‌వ‌ర్థ‌నే అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

IND vs AUS : గిల్ ‘క్లీన్ క్యాచ్’ వివాదం.. నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయి.. క్యాచ్‌ను ప‌ట్టుకున్న ఆట‌గాడు ఎంత‌సేపు బంతిని చేతిలో ఉంచుకోవాలి?

వన్డే క్రికెట్ చరిత్రలో ఔట్‌ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆట‌గాళ్లు..

మహేల జయవర్ధనే (శ్రీలంక‌) – 443 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 218 క్యాచ్‌లు
విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 298 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 161 క్యాచ్‌లు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 372 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 160 క్యాచ్‌లు
అజారుద్దీన్ (భార‌త్‌) – 332 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 156 క్యాచ్‌లు
రాస్ టేలర్ (న్యూజిలాండ్‌) – 232 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 142 క్యాచ్‌లు