IND vs AUS : గిల్ ‘క్లీన్ క్యాచ్’ వివాదం.. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. క్యాచ్‌ను పట్టుకున్న ఆటగాడు ఎంతసేపు బంతిని చేతిలో ఉంచుకోవాలి?
ట్రావిస్ హెడ్ క్యాచ్ అందుకున్న తరువాత టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు.

Umpire warns Shubman Gill after Travis Heads catch What mcc law rules is
దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్‌లో టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ క్యాచ్‌ను అందుకున్న తరువాత గిల్‌ను అంపైర్ హెచ్చరించాడు. బంతిని ఎక్కువ సేపు చేతుల్లో ఉంచుకోవాలని, పూర్తి నియంత్రణలో వచ్చిన తరువాతనే బాల్‌ను విడిచిపెట్టాలని సూచించాడు.
సెమీస్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌ను వరుణ్ చక్రవర్తి వేశాడు. రెండో బంతికి ట్రావిస్ హెడ్ భారీ షాట్ ఆడాడు. మిస్ టైమింగ్ కావడంతో బంతి గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న గిల్ పరిగెత్తుకుంటూ వచ్చి చక్కని క్యాచ్‌ను అందుకున్నాడు. గిల్ క్యాచ్‌ను అందుకున్నప్పటికీ.. అతడు వెంటనే బంతిని విడుదల చేయడం పై అంపైర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దీంతో గిల్‌కు వార్నింగ్ ఇచ్చాడు.
IND vs AUS : ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఈ విషయాన్ని గమనించారా.. భారత ఆటగాళ్లు అలా ఎందుకు చేశారంటే?
VARUN CHAKRAVARTHY IS A NATIONAL HERO…!!! 🇮🇳🔥 pic.twitter.com/BRe552Gfdn
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2025
నిబంధనలు ఏమీ చెబుతున్నాయి ?
ఓ ఆటగాడు క్యాచ్‌ను అందుకున్న తరువాత బంతిని ఎంత సేపు పట్టుకోవాలనే దానికి నిర్ణీత సమయం అంటూ ఏదీ లేదు. అయినప్పటికి బంతి పై ఆటగాడు పూర్తి నియంత్రణ కలిగిఉండడంతో పాటు సదరు ఆటగాడు స్వంత కదలికను కలిగి ఉండాలని మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) నియమం చెబుతోంది.
‘క్యాచ్ పట్టడం అనేది.. ఫీల్డర్ బంతిని మొదటిసారి తాకినప్పటి నుంచి ప్రారంభం అవుతుంది. ఫీల్డర్ బంతితో పాటు అతని/ఆమె కదలికలపై పూర్తి నియంత్రణ పొందినప్పుడు ముగుస్తుంది.’ అని నిబంధన చెబుతోంది.
IND vs AUS : వరుసగా టాస్‌లు ఓడిపోతున్న రోహిత్ శర్మ.. ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు..
ఇక హెడ్ మరోసారి భారత బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 39 పరుగులు సాధించాడు.