IND vs AUS : ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఈ విషయాన్ని గమనించారా.. భారత ఆటగాళ్లు అలా ఎందుకు చేశారంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ జరుగుతోంది.

Do you know Why Team India wearing black armbands during semifinal clash against Australia
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఆదివారం (మార్చి 9న) ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
సెమీస్‌లో ఆసీస్ టాస్ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో ఆలోచన చేయకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండు మార్పులతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. మాథ్యూ షార్ట్ స్థానంలో కూపర్ కొన్నోలీ, స్పెన్సర్ జాన్సన్ స్థానంలో తన్వీర్ సంగాలు తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు.
ఇక భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవు. అయితే.. టీమ్ఇండియా ఆటగాళ్లు మాత్రం తమ చేతికి నల్లటి బ్యాండ్‌లను ధరించి బరిలోకి దిగారు. ఇలా ఆటగాళ్లు నల్లటి బ్యాండ్‌లు ధరించడానికి గల కారణం ఏమిటని కొందరు సోషల్ మీడియాలో వెతుకుతున్నారు.
IND vs AUS : వరుసగా టాస్‌లు ఓడిపోతున్న రోహిత్ శర్మ.. ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు..
టీమ్ఇండియా మాజీ ఆటగాడు పద్మాకర్ శివాల్కర్ సోమవారం కన్నుమూశాడు. 84 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. శివాల్కర్‌కు నివాళిగా భారత జట్టు ఆటగాళ్లు ఆసీస్‌తో సెమీస్‌తో మ్యాచ్‌లో నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు.
శివాల్కర్ 1961-62 నుంచి 1987-88 మధ్య మొత్తం 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 19.74 సగటుతో 589 వికెట్లు తీశాడు. 22 సంవత్సరాల వయసులో రంజీల్లో అరంగ్రేటం చేసిన శివాల్కర్ 48 సంవత్సరాల వయసు వరకు ఆటను కొనసాగించడం విశేషం. ముంబై రంజీ ట్రోఫీలో 15 సీజన్ల విజయాల పరంపరలో తన వంతు పాత్ర పోషించాడు ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్. 12 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసుకున్నాడు. 2017లో సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో బీసీసీఐ ఆయన్ని సత్కరించింది.
ఆస్ట్రేలియా తుది జట్టు..
కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్‌చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ
భారత తుది జట్టు..
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.