IND vs AUS : కుల్దీప్ యాదవ్ పై రోహిత్, విరాట్ కోహ్లీ ఆగ్రహం.. వామ్మో కింగ్ నోటి నుంచి అంత పెద్ద మాట..
కుల్దీప్ యాదవ్ పై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు విరుచుకుపడ్డారు.

IND vs AUS Virat Kohli Rohit Sharma hurl abuse at Kuldeep Yadav for lack of effort
దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీలు సహనం కోల్పోయారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పై నోరు పారేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే?
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ 32 ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఐదో బంతిని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీప్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడాడు. సింగిల్ తీశాడు. అయితే.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ బంతిని అందుకుని కుల్దీప్ వైపు త్రో వేశాడు. అయితే.. వికెట్ల వద్ద ఉన్న కుల్‌దీప్ బాల్ స్పీడ్ గా రావడంతో వదిలివేశాడు. అయితే.. వెనకే బ్యాకప్‌గా ఉన్న రోహిత్ బాల్‌ను పట్టుకోవడంతో ఆసీస్‌కు ఎక్స్‌ట్రా పరుగులు రాలేదు.
IND vs AUS : లబుషేన్‌ను గట్టిగా కౌగిలించుకున్న జడేజా..! అంపైర్‌కు స్టీవ్ స్మిత్ ఫిర్యాదు..
అయితే.. కుల్దీప్ యాదవ్ బంతిని పట్టుకోకపోవడం పై తొలుత విరాట్ కోహ్లీ ఆగ్రహ్యం వ్యక్తం చేశాడు. అసభ్య పదజాలంతో తిట్టాడు. ఆ తరువాత రోహిత్ శర్మ సైతం కుల్దీప్‌ను మందలించాడు. దీనిని పెద్దగా పట్టించుకోని కుల్దీప్ మిగిలిన ఒక్క బంతిని వేసి ఓవర్‌ను పూర్తి చేసుకున్నాడు.
Chuldeep😭😭 https://t.co/KNa6yFug5e pic.twitter.com/fHfGsRl8iD
— S A K T H I ! (@Classic82atMCG_) March 4, 2025
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొందరు కుల్దీప్ యాదవ్‌కు మద్దతు ఇస్తుండగా మరికొందరు ఫీల్డింగ్‌లో అంత నిర్లక్ష్యం పనికి రాదని మండిపడుతున్నారు. సీనియర్ ఆటగాళ్లు ఇలా చేయడం తగదన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (73; 96 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ కేరీ (61; 57 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు బాదారు. ట్రావిస్ హెడ్ (39), మార్నస్ లబుషేన్ (29)లు ఫర్వాలేదనిపింగా.. జోస్ ఇంగ్లిష్ (11), గ్లెన్ మాక్స్‌వెల్ (11)లు విఫలం అయ్యారు. టీమ్ఇండియా బౌలర్లలో షమీ మూడు, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా చెరో రెండు, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా ఓ వికెట్ తీశారు.