IND vs AUS : లబుషేన్‌ను గట్టిగా కౌగిలించుకున్న జడేజా..! అంపైర్‌కు స్టీవ్ స్మిత్ ఫిర్యాదు..
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

IND vs AUS Steve Smith throws his hands complains as Ravindra Jadeja doesnt let Marnus Labuschagne
చాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఆసీస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బంతిని ఆపే క్రమంలో రవీంద్ర జడేజా నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న లబుషేన్ ఢీ కొట్టాడు. ఆ తరువాత అతడిని గట్టిగా పట్టుకున్నాడు. ఇది చూసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను జడేజా వేశాడు. రెండో బంతికి స్మిత్ స్ట్రైయిట్ షాట్ ఆడాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన జడేజా తన కుడి పాదంతో బంతిని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ.. బంతి లబుషేన్ బ్యాట్‌కు తగిలి మిడ్ వికెట్ వైపు వెళ్లింది. దీంతో ఆస్ట్రేలియన్లు సింగిల్ తీసే అవకాశాన్ని కోల్పోవడంతో జడేజా.. లబుషేన్‌ను కౌగిలించుకున్నాడు.
దీనిపై స్మిత్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తన చేతులతో సైగ చేస్తూ ఏవో మాటలు అన్నాడు. లబుషేన్ ఏమీ మాట్లాడలేదు. అంపైర్‌కు జడేజా పై స్మిత్ ఫిర్యాదు చేశాడు.
చేతికి ఉన్న టేప్‌ను తీయించారు..
అంతకముందు ఆన్ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ బౌలర్ రవీంద్ర జడేజా చేతికి ఉన్న టేప్‌లను తీయమని చెప్పాడు. దీంతో బౌలింగ్ చేతి వేళ్లకు ఉన్న టేపులను తీసి జడేజా బౌలింగ్ చేశాడు. ఇన్నింగ్స్ 23వ ఓవర్‌లో జడేజా బౌలింగ్‌లో లబుషేన్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లోని మూడో బంతికి ఎల్బీడబ్ల్యూగా లబుషేన్ ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో లబుషేన్ 36 బంతులు ఎదుర్కొన్నాడు. రెండు ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 29 పరుగులు సాధించాడు.
రెండు జీవనధానాలు..
మరోవైపుకు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు రెండు లైఫ్‌లు వచ్చాయి. ఇన్నింగ్స్ 14వ ఓవర్‌ను అక్షర్ పటేల్ వేయగా ఈ ఓవర్‌లోని బంతి స్మిత్ బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్‌ను తీసుకుని వెళ్లి స్టంప్స్‌ను తాకింది. అయితే.. బెయిల్ కిందపడకపోవడంతో స్మిత్ బతికి పోయాడు. ఆ సమయంలో స్మిత్ 23 పరుగులతో ఉన్నాడు. ఇక 22 ఓవర్‌లో షమీ బౌలింగ్ స్మిత్ షాట్ ఆడగా.. రిటర్న్ క్యాచ్ అందుకోవడంలో షమీ తడబడ్డాడు. ఆ సమయంలో స్మిత్ 36 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
తనకు వచ్చిన అవకాశాలను స్మిత్ సద్వినియోగం చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకం దిశగా వెలుతున్న అతడిని షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో స్మిత్ మొత్తంగా 96 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 73 పరుగులు చేశాడు.