IND vs BAN : ముగిసిన మూడో రోజు ఆట‌.. ఇంకా 125 ప‌రుగుల వెనుకంజ‌లో భార‌త్‌

తొలి ఇన్నింగ్స్‌లో 46 ప‌రుగుల‌కే ఆలౌటైన భార‌త్ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశ‌గా ప‌య‌నిస్తోంది.

IND vs BAN 1st Day 3 Stumps India trail by 125 runs

తొలి ఇన్నింగ్స్‌లో 46 ప‌రుగుల‌కే ఆలౌటైన భార‌త్ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశ‌గా ప‌య‌నిస్తోంది. 356 ప‌రుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమ్ఇండియా మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి మూడు వికెట్ల నష్టానికి 231 ప‌రుగులు చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భార‌త్ ఇంకా 125 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. క్రీజులో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (70) ఉన్నాడు.

356 ప‌రుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భార‌త్‌కు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌(52), య‌శ‌స్వి జైస్వాల్ (35) లు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 72 ప‌రుగులు జోడించారు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన ఓపెన‌ర్లు ఆ త‌రువాత ఎదురుదాడికి దిగారు. బౌండ‌రీల మోత మోగించారు. అయితే.. అజాజ్ ప‌టేల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు క్రీజు వ‌దిలి ముందుకు వ‌చ్చిన య‌శ‌స్వి జైస్వాల్ స్టంపౌట్ అయ్యాడు.

IND vs NZ : త‌న దురదృష్టాన్ని చూసి తలప‌ట్టుకున్న రోహిత్ శ‌ర్మ‌.. ఇలా ఔట్ అవుతాడ‌ని క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌డు

వ‌న్‌డౌన్ వ‌చ్చిన కోహ్లీ(70)తో క‌లిసి రోహిత్ శ‌ర్మ త‌న‌దైన శైలిలో ప‌రుగులు రాబ‌ట్టాడు. హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్న అనంత‌రం అజాజ్ ప‌టేల్ బౌలింగ్‌లో దుర‌దృష్ట‌వ‌శాత్తు ఔట్ అయ్యాడు. డిఫెన్స్ ఆడ‌గా.. బంతి బ్యాట్‌ను తాకుతూ వ‌న్ స్టెప్ తీసుకుని రోహిత్ ప్ర‌తిస్పందించే లోపే బ్యాడ్‌, ప్యాడ్‌ల మ‌ధ్య ఖాళీలోంచి వెళ్లి బెయిల్స్ ప‌డ‌గొట్టింది. దీంతో రోహిత్ జ‌ట్టు స్కోరు 95 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.

ఈ ద‌శ‌లో సీనియర్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ, యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌లు ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. ముఖ్యంగా స‌ర్ఫ‌రాజ్ ఖాన్ వ‌న్డే త‌ర‌హాలో బ్యాటింగ్ చేశాడు. త‌న అమ్ముల‌పొద‌లోని అన్ని ర‌కాల షాట్ల‌ను ఆడుతూ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన కోహ్లీ క్ర‌మంగా జోరు అందుకున్నాడు.

IND vs NZ : సెహ్వాగ్ రికార్డు బ్రేక్.. టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆరో ప్లేయ‌ర్‌గా కివీస్ మాజీ కెప్టెన్ ..

మొద‌ట స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, ఆ త‌రువాత కోహ్లీలు అర్థ‌శ‌త‌కాలు పూర్తి చేస్తున్నారు. 53 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద కోహ్లీ టెస్టుల్లో 9 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. మ‌రో ఓవ‌ర్‌లో ఆట ముగుస్తుంద‌న‌గా కోహ్లీ ఔట్ అయ్యాడు. దీంతో మూడో రోజును ముగించారు. కోహ్లీ, స‌ర్ఫ‌రాజ్ జోడి మూడో వికెట్‌కు 136 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఇక‌ నాలుగో రోజు కివీస్ స్కోరును దాటి భార‌త్ ఎంత స్కోరు సాధిస్తుంది అన్న దానిపైనే మ్యాచ్ ఫ‌లితం ఆధార‌ప‌డి ఉంది.