భారత్ కొంపముంచిన యశస్వీ జైస్వాల్.. గెలిచే మ్యాచ్‌ను ఓడగొట్టావ్ కద బ్రో..! సిరాజ్ ఆగ్రహం.. గంభీర్ అయితే.. వీడియో వైరల్

హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిలో యశస్వీ జైస్వాల్‌ది కీలక భూమిక..

Yashasvi Jaiswal

IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ జట్టు పరాజయం పాలైంది. చివరి రోజు సాధారణంగా సాగిన భారత బౌలింగ్, ఫీల్డింగ్‌ను సొమ్ము చేసుకుంటూ తన మార్కు అయిన బజ్‌బాల్ బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ 371 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు ఓటమికి ప్రధాన కారణం ఎవరంటే.. యశస్వీ జైస్వాల్ అని చెప్పొచ్చు.

Also Read: ENG vs IND: అప్పట్లో ఆస్ట్రేలియా.. ఇప్పుడు టీమిండియా.. టెస్టుల్లో చెత్తరికార్డు నమోదు..

హెడింగ్లీ టెస్టులో యశస్వీ జైస్వాల్ భారత్ జట్టు ఓటమిలో కీలక భూమిక పోషించాడు. అతను మైదానంలో చాలా పేలవమైన ఫీల్డింగ్ ప్రదర్శనతో బౌలర్లకు, టీమిండియా ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించాడు. తొలి ఇన్నింగ్స్ లో జైస్వాల్ మూడు కీలక క్యాచ్ లను వదిలేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత్ చేసిన 471 పరుగులకు ప్రతిస్పందనగా 465 పరుగులు చేయగలిగింది. జైస్వాల్ ఆ మూడు క్యాచ్ లు అందుకొని ఉండిఉంటే.. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో కనీసం 400 పరుగులకు కూడా చేరుకోలేకపోయేంది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. జైస్వాల్ తొలి ఇన్నింగ్స్ లో వదిలేసిన మూడు క్యాచ్ లు జస్ర్పీత్ బుమ్రా బౌలింగ్‌లోవే.

Also Read: IND vs END: తొలి టెస్టులో ఓటమి తరువాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన కామెంట్స్.. ఆ రెండు అంశాలే మా ఓటమికి కారణం..

రెండో ఇన్నింగ్స్‌లోనూ యశస్వీ జైస్వాల్ కీలక క్యాచ్‌ను వదిలేశాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో డకెట్ ఇచ్చిన క్యాచ్‌ను జైస్వాల్ నేలపాలు చేశాడు. అతడు ఆ క్యాచ్ ను పట్టుంటే ఇంగ్లాండ్ పై భారత్ ఒత్తిడి పెంచగలిగేది. జైస్వాల్ క్యాచ్ మిస్ చేసిన సమయంలో డకెట్ 97 పరుగులతో ఉన్నాడు. ఆ తరువాత డకెట్ సెంచరీ పూర్తిచేయడంతోపాటు 149 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు విజయంలో డకెట్ సెంచరీ కీలక భూమిక పోషించింది. డకెట్ క్యాచ్ మిస్ చేయగానే.. బౌలర్ సిరాజ్ జైస్వాల్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు.. జైస్వాల్ నాలుగు క్యాచ్‌లు మిస్ చేయడంపై కోచ్ గంభీర్ సైతం అసహనం వ్యక్తం చేయడం కనిపించింది.


జైస్వాల్ మొత్తం నాలుగు క్యాచ్‌లు వదిలివేయడం భారత ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఓ టెస్టు మ్యాచ్ లో అత్యధిక క్యాచ్ లు చేజార్చిన భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు.