IND vs ENG 2ND ODI Play stopped due to floodlight failure
భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. భారీ లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా ఓపెనర్లు దూకుడుగా ఆడుతుండగా స్టేడియంలోని ఓ ఫ్లడ్ లైట్ సాంకేతిక సమస్య వల్ల వెలగడం లేదు. పది నిమిషాల పాటు మైదానంలోనే ఆటగాళ్ల ఉన్నా కూడా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. దీంతో భారత ఓపెనర్లు రోహిత్, గిల్ అసహనం వ్యక్తం చేశారు. ఆటగాళ్లు అంపైర్లు మైదానాన్ని వీడారు.
305 పరుగుల లక్ష్య ఛేదనలో మ్యాచ్ నిలిపివేసే సమయానికి భారత్ స్కోరు 6.1 ఓవర్లలో 48/0. కెప్టెన్ రోహిత్ శర్మ (29నాటౌట్; 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (17నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. భారత విజయానికి 43.5 ఓవర్లలో ఇంకా 257 పరుగులు అవసరం.
IND vs ENG : రోహిత్ శర్మ అరుదైన ఘనత.. క్రిస్‌గేల్ సిక్సర్ల రికార్డు బ్రేక్..
A slight delay as one of the floodlight towers has gone off here in Cuttack 🏟️
📸: Disney+Hotstar#INDvsENG #Cuttack #CricketTwitter pic.twitter.com/Odwr6nyRhh
— InsideSport (@InsideSportIND) February 9, 2025
అంతకముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. బెన్ డకెట్ (65), జోరూట్ (69), లియామ్ లివింగ్ స్టోన్ (41), కెప్టెన్ జోస్ బట్లర్ (34), హ్యారీ బ్రూక్ (31), ఫిలిప్ సాల్ట్ (26)లు రాణించడంతో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తిలు ఒక్కొ వికెట్ సాధించారు.
IND vs ENG : ఇదేం అన్యాయం సామీ.. కోహ్లీ కోసం యువ ఆటగాడు బలి.. ఒక్క మ్యాచ్‌కే..
అంతర్జాతీయ మ్యాచ్ జరిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రాక రాక రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చాడని.. ఇప్పుడు ఇలా జరగడంతో హిట్ మ్యాన్ కాన్‌సన్‌ట్రేషన్ దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు.