IND vs ENG : ఇదేం అన్యాయం సామీ.. కోహ్లీ కోసం యువ ఆటగాడు బలి.. ఒక్క మ్యాచ్‌కే..
తొలి వన్డేకు దూరమైన కోహ్లీ రెండో వన్డేకు వచ్చేశాడు.

IND vs ENG 2nd ODI kohli return and varunchakaravarthy debutIND vs ENG 2nd ODI kohli return and varunchakaravarthy debut
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కటక్ వేదికగా ఆదివారం భారత్, ఇంగ్లాండ్ జట్లు రెండో వన్డే మ్యాచ్‌లో తలపడుతున్నాయి. తొలి వన్డేలో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సాధించాలని ఆరాటపడుతోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. మోకాలి నొప్పితో తొలి వన్డేకు దూరమైన టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వచ్చేశాడు. అతడి కోసం యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను పెట్టారు. కాగా.. తొలి వన్డే మ్యాచ్‌తోనే యశస్వి వన్డేల్లో అరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్‌లో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇక తొలి వన్డేలో కోహ్లీ స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. వైస్ కెప్టెన్ గిల్ సైతం హాఫ్ చేశాడు. దీంతో వీరిద్దరిని పక్కన బెట్టలేని పరిస్థితి ఉండడంతో యశస్వి జైస్వాల్ పై వేటు పడింది.
Rachin Ravindra : అమ్మబాబోయ్.. క్రికెటర్ కు తీవ్ర గాయం, బంతి ఎంత బలంగా తాకిందో చూడండి..
HUGE CHEERS WHEN ROHIT SHARMA CONFIRMED VIRAT KOHLI’S PARTICIPATION IN CUTTACK. 🐐pic.twitter.com/7UwkWVD0Qn
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 9, 2025
స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని తీసుకున్నారు. ఈ మ్యాచ్‌తోనే వన్డేల్లో వరుణ్ చక్రవర్తి అరంగ్రేటం చేశాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అతడికి క్యాప్ అందించాడు. మరోవైపు ఇంగ్లాండ్ తమ జట్టులో మూడు మార్పులు చేసింది. కార్స్, జాకబ్ బెతల్, అర్చర్‌ల స్థానాల్లో మార్క్ వుడ్, గుస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్ లను తీసుకుంది.
ICC Champions Trophy: ఇండియాని ఓడించాలని పాక్ ఎంత రగిలిపోతుందో చూడండి.. పాక్ ప్రధాని మాటల్లో
భారత తుది జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లాండ్ తుది జట్టు..
బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్.