ICC Champions Trophy: ఇండియాని ఓడించాలని పాక్ ఎంత రగిలిపోతుందో చూడండి.. పాక్ ప్రధాని మాటల్లో

ICC Champions Trophy: ఇండియాని ఓడించాలని పాక్ ఎంత రగిలిపోతుందో చూడండి.. పాక్ ప్రధాని మాటల్లో

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Image Credit -@PakPMO/X)

Updated On : February 9, 2025 / 10:59 AM IST

ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి పాకిస్తాన్ ఎంత కసితో ఉందో అందరికీ తెలుసు. సుమారు 29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ లో ఒక ఐసీసీ ఈవెంట్ జరగబోతోంది. దీంతో ఈ టోర్నీలో ఎలాగైనా గెలవాలని భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే, అదొక్కటే కాదు. పాకిస్తాన్ జట్టుకు ఇంకో ఆశ కూడా ఉంది. చాంపియన్స్ ట్రోఫీని గెలవడంతో పాటు ముఖ్యంగా ఇండియాని ఓడించాలనేది ఆ టీమ్ ప్లాన్. అంతకంటే ముఖ్యంగా ఆ దేశ ప్రధాని ఆశ కూడా. సాక్షాత్తూ పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ ఈ కామెంట్స్ చేశారు. ‘పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే కాదు. భారత్ ను ఓడించాలి. ఈ పోరాటంలో దేశం మొత్తం పాక్ జట్టుకు మద్దతుగా ఉంటుంది’ అని షరీఫ్ ప్రకటించారు.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా, పాక్ మ్యాచ్ లు జరగనున్నాయి. పాకిస్తాన్‌కు ట్రిప్ కు భారత్ నిరాకరించింది. దీంతో ఈ ఏర్పాట్లు చేశారు. రోహిత్ శర్మ నేతృత్వంలో ఉన్న భారత్ జట్టు తమ అన్ని మ్యాచ్‌లను అదే స్టేడియంలో ఆడుతుంది. సెమీఫైనల్, ఫైనల్ కూడా ఇక్కడే ఉంటాయి. అయితే, ఈ టోర్నమెంట్ మిగతా భాగాన్ని పాకిస్తాన్ లో నిర్వహిస్తారు.. ఇది 29 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్‌లో జరగనున్న ICC టోర్నమెంట్. దీనిపై షరీఫ్ తమ జట్టు విజయవంతంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తుందని పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు.

“ఇది పాకిస్తాన్‌కు పెద్ద సందర్భం, ఎందుకంటే 29 సంవత్సరాల తర్వాత మేము పెద్ద ICC ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాం. మా జట్టు ఈ చాంపియన్స్ ట్రోఫీతో దేశాన్ని గర్వపడే విధంగా కొనసాగిస్తుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది,” అని షరీఫ్ అన్నారు.

ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ ముందు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లతో ఒక ట్రై-సిరీస్ నిర్వహించనుంది. గడాఫీ స్టేడియం, కరాచీ నేషనల్ స్టేడియంల్లో ఈ సిరీస్ నిర్వహించి వాటిని టెస్ట్ చేస్తారు.