IND vs ENG : ’50’లో 100.. అహ్మ‌దాబాద్ వ‌న్డేలో శుభ్‌మ‌న్ గిల్ రికార్డులు ఇవే..

అహ్మ‌దాబాద్ వ‌న్డేలో శ‌త‌కంతో చెల‌రేగిన శుభ్‌మ‌న్ గిల్ ప‌లు రికార్డుల‌ను అందుకున్నాడు.

Shubman Gill becomes first indian player to score a century in 50th odi

టీమ్ఇండియా యువ ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో అత‌డు శ‌త‌కంతో చెల‌రేగాడు. 95 బంతుల్లోనే మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 102 బంతులు ఎదుర్కొన్న గిల్ 14 ఫోర్లు, 3 సిక్స‌ర్ల సాయంతో 112 ప‌రుగులు సాధించాడు. కాగా.. గిల్‌కు ఇది 50వ వ‌న్డే మ్యాచ్ కావ‌డం విశేషం.

ఈ క్ర‌మంలో ప‌లు రికార్డుల‌ను అందుకున్నాడు. 50వ వ‌న్డే మ్యాచ్‌లో శ‌త‌కం చేసిన తొలి భార‌త క్రికెటర్‌గా శుభ్‌మ‌న్ గిల్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు.. 50వ ఇన్నింగ్స్‌ల్లో అత్యంత వేగంగా 7 వ‌న్డే శ‌త‌కాలు బాదిన ప్లేయ‌ర్‌గా నిలిచాడు. వ‌న్డేల్లో అత్యంత వేగంగా 2500 ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగా నిలిచాడు. తొలి యాభై వ‌న్డేల్లో అత్య‌ధిక ర‌న్స్ చేసిన ఆట‌గాడినూ నిలిచాడు.

గిల్ సాధించిన రికార్డులు ఇవే..

వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల ప‌రంగా) 2500 ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు..

శుభ్‌మ‌న్ గిల్ (భార‌త్‌) – 50 ఇన్నింగ్స్‌ల్లో
హ‌షీమ్ ఆమ్లా (ద‌క్షిణాఫ్రికా) – 51 ఇన్నింగ్స్‌ల్లో
ఇమామ్ ఉల్ హ‌క్ (పాకిస్థాన్‌) – 52 ఇన్నింగ్స్‌ల్లో
వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్‌) – 56 ఇన్నింగ్స్‌ల్లో
జోనాథ‌న్ ట్రాట్ (ఇంగ్లాండ్‌) – 56 ఇన్నింగ్స్‌ల్లో

IND vs ENG : దంచికొట్టిన భార‌త బ్యాటర్లు.. ఇంగ్లాండ్ ముందు భారీ ల‌క్ష్యం..

వన్డేల్లో తొలి యాభై ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్లు..
శుబ్‌మన్‌ గిల్ (భార‌త్) – 2587 పరుగులు
హషీమ్‌ ఆమ్లా (ద‌క్షిణాప్రికా)- 2486 పరుగులు
ఇమామ్‌ ఉల్‌ హక్ (పాకిస్థాన్‌) – 2386 పరుగులు
ఫఖర్‌ జమాన్ (పాకిస్తాన్‌) – 2262 పరుగులు
షై హోప్ (వెస్టిండీస్‌) – 2247 పరుగులు

ఒకే వేదికపై వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో శతకం బాదిన క్రికెటర్లు..
ఫాఫ్‌ డుప్లెసిస్ (ద‌క్షిణాఫ్రికా) – వాండరర్స్‌ స్టేడియం, జొహన్నస్‌బర్గ్‌
డేవిడ్‌ వార్నర్ (ఆస్ట్రేలియా) – అడిలైడ్‌ ఓవల్‌, అడిలైడ్‌
బాబర్‌ ఆజం (పాకిస్తాన్‌) – నేషనల్‌ స్టేడియం, కరాచీ
క్వింటన్‌ డికాక్ (ద‌క్షిణాప్రికా) – సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌, సెంచూరియన్‌
శుబ్‌మన్‌ గిల్ (భార‌త్) – నరేంద్ర మోదీ స్టేడియం(మొతేరా), అహ్మదాబాద్‌

Virat Kohli- Adil Rashid : వార్నీ కోహ్లీ వికెట్ తీయ‌డం అంటే ఇష్ట‌మా ఆదిల్ ర‌షీద్ నీకు.. అత్య‌ధిక సార్లు ఔట్ చేసిన బౌల‌ర్‌గా..

మూడు వ‌న్డేల సిరీస్‌లో వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచ‌రీలు చేసిన భార‌త ఆట‌గాళ్లు..
కృష్ణమాచారి శ్రీకాంత్ – 1982లో శ్రీలంక పై
దిలీప్ వెంగ్‌సర్కార్ – 1985లో శ్రీలంక‌పై
మ‌హమ్మద్ అజారుద్దీన్ – 1993లో శ్రీలంక పై
ఎంఎస్ ధోని – 2019లో ఆస్ట్రేలియా పై
శ్రేయాస్ అయ్యర్ – 2020లో న్యూజిలాండ్ పై
ఇషాన్ కిషన్ – 2023లో వెస్టిండీస్ పై
శుభ్‌మ‌న్ గిల్ – 2025లో ఇంగ్లాండ్ పై