IND vs ENG: ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు.. భారత జట్టుకు బిగ్ షాక్..

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. తొలిరోజు ఆటలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కీలక ప్లేయర్ గ్రౌండ్ వదిలి వెళ్లిపోయాడు.

IND vs ENG 3rd Test

IND vs ENG 3rd Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు మ్యాచ్ గురువారం లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. జో రూట్ (99 బ్యాటింగ్), బెన్ స్టోక్స్ (39 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అయితే, తొలి రోజు ఆటలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.

Also Read: IND vs ENG: బాబులూ భయపడ్డారా.. బజ్‌బాల్ ఎక్కడ..? టుక్ టుక్.. ఏందీఆట..! ఇంగ్లాండ్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్న సిరాజ్, గిల్.. వీడియోలు వైరల్

తొలిరోజు మొదటి సెషన్‌లో ఉత్సాహంగా కనిపించిన వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ మధ్యలో గ్రౌండ్ వదిలి వెళ్లిపోయాడు. రెండో సెషన్‌లో జస్ర్పీత్ బుమ్రా వేసిన 34వ ఓవర్లో రెండో బంతిని అందుకునే క్రమంలో రిషబ్ పంత్‌కు గాయమైంది. అతని ఎడమ చేతి వేలికి బలంగా బంతి తాకింది. దీంతో పంత్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అయినా నొప్పి తగ్గకపోవడంతో పంత్ గ్రౌండ్ వదిలి వెళ్లిపోయాడు. పంత్ స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ చేయడానికి వచ్చాడు.

Also Read: IND vs ENG: రా..రా.. పరుగు తీసుకో..! జోరూట్‌ను ఆటాడుకున్న జడేజా.. అయ్యో.. సెంచరీ చెయ్యనీలే.. ఫన్నీ వీడియో వైరల్

ఇంగ్లాండ్ స్కోర్ 93 పరుగుల వద్ద పంత్ మైదానంను వీడి వెళ్లిపోయాడు. గాయం తరువాత చికిత్స తీసుకొని మ్యాచ్‌లో కొనసాగే ప్రయత్నం చేసినప్పటికీ.. నొప్పి తీవ్రం కావడంతో పంత్ గ్రౌండ్ వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. పంత్ వేలికి బలమైన గాయం అయినట్లు తెలుస్తోంది. భారత జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్‌లో పంత్ ఒకడు. అతను తిరిగి మైదానంలోకి రాకుంటే టీమిండియాకు బిగ్ షాక్ తగిలినట్లే.

రిషబ్ పంత్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం.. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన జురెల్ బ్యాటింగ్ చేయలేడు. సూపర్ ఫామ్ లో ఉన్న రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు రాకపోతే భారత్ కు ఒక బ్యాటర్ తక్కువవుతాడు. అది జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. పంత్ మళ్లీ గ్రౌండ్‌లోకి ఎప్పుడు అడుగుపెడతాడో తెలియదు. రెండో రోజు (శుక్రవారం) ఆటలో పంత్ గ్రౌండ్‌లోకి రాకుంటే మూడో టెస్టు నుంచి అతను దూరమయ్యే అవకాశం కూడా ఉంది.