IND vs ENG: రా..రా.. పరుగు తీసుకో..! జోరూట్‌ను ఆటాడుకున్న జడేజా.. అయ్యో.. సెంచరీ చెయ్యనీలే.. ఫన్నీ వీడియో వైరల్

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్‌లో భాగంగా తొలిరోజు చివరి ఓవర్లో జడేజా, జోరూట్ మధ్య ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతుంది.

IND vs ENG: రా..రా.. పరుగు తీసుకో..! జోరూట్‌ను ఆటాడుకున్న జడేజా.. అయ్యో.. సెంచరీ చెయ్యనీలే.. ఫన్నీ వీడియో వైరల్

IND vs ENG 3rd Test

Updated On : July 11, 2025 / 7:20 AM IST

IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో మూడో టెస్టు మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ తీసుకుంది. అయితే, తొలిరోజు ఇంగ్లాండ్ బ్యాటింగ్ నత్తనడకగా సాగింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది.

Also Read: HCAపై అందుకే ఫిర్యాదు చేశాం.. ఇన్ని తప్పులు జరిగాయి: TCA జనరల్ సెక్రటరీ

సాధారణంగా దూకుడైన ఆటతో పరుగులు రాబట్టే ఆ జట్టు 3.32 రన్‌రేట్‌తో మాత్రమే పరుగులు చేయగలిగింది. 2022లో మెక్‌కలమ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించాక ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసిన 17 సందర్భాల్లో తొలి సెషన్లో ఆ జట్టు అతి తక్కువ రన్‌రేట్ ఇదే. క్రాలీ(18), డకెట్ (23), ఒలీ పోప్ (44), బ్రూక్ (11) తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి జో రూట్ 99 పరుగులతో, బెన్ స్టోక్స్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు. జో రూట్ 191 బంతుల్లో తొమ్మిది ఫోర్ల సహాయంతో 99 పరుగులు చేశాడు. రూట్ 99 పరుగుల వద్ద జడేజా, జోరూట్ మధ్య ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.


జో రూట్, బెన్ స్టోక్స్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకుగిల్ బౌలర్లందరినీ ఉపయోగించినా ఉపయోగం లేకుండా పోయింది. అయితే, మ్యాచ్ లో భాగంగా తొలిరోజు చివరి ఓవర్లో జో రూట్ తన 37వ సెంచరీ పూర్తిచేస్తాడని అందరూ భావించారు. చివరి ఓవర్ ఆకాశ్ దీప్ వేశాడు. ఆ ఓవర్లో నాల్గో బంతిని లెంగ్త్ డెలివరీ చేయగా.. క్రీజులో ఉన్న జో రూట్ బ్యాక్‌వర్డ్ వైపు తరలించి సింగిల్ తీశాడు.. రెండో పరుగుకోసం ప్రయత్నించగా.. అప్పటికే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జడేజా చేతిలోకి బంతి వెళ్లింది. దీంతో బెన్ స్టోక్స్ వద్దు.. రన్ కు రావొద్దు అంటూ చెప్పడంతో రూట్ ఆగిపోయాడు. ఈ సమయంలో జడేజా, జోరూట్ మధ్య ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది.

జడేజా చేతిలోకి బంతి వెళ్లగానే.. రెండో పరుగుకోసం ముందుకు వెళ్లిన జోరూట్ వెనక్కు వచ్చే ప్రయత్నం చేశాడు. రవీంద్ర జడేజా బంతిని కీపర్ వైపు విసిరే బదులు జో రూట్ ను ఆటపట్టించాడు. బంతిని కింద పడేసి పరుగు తీసుకో అంటూ సూచించాడు. దీంతో జో రూట్ నవ్వుతూ ముందుకు వెళ్లబోగా.. జడేజా వెంటనే బంతిని మళ్లీ చేతిలోకి తీసుకున్నాడు.. దీంతో జోరూట్ వెనక్కు వచ్చాడు. స్టేడియం అంతటా బిగ్గరగా కేకలు వేస్తూ జోరూట్ సెంచరీ పూర్తయినట్లేనని భావించినప్పటికీ.. తొలిరోజు 99 పరుగుల వద్దే రూట్ ఆగిపోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో ‘ఈరాత్రి అతన్ని 100 పరుగులు చేయనివ్వకండి’ అంటూ భారత ఆటగాళ్లలో ఒకరు చెబుతున్నట్లు స్టంప్ మైక్ లో వినిపించింది.