HCAపై అందుకే ఫిర్యాదు చేశాం.. ఇన్ని తప్పులు జరిగాయి: TCA జనరల్ సెక్రటరీ

విజిలెన్స్‌కి, CIDకి ఫిర్యాదు చేశాము.

HCAపై అందుకే ఫిర్యాదు చేశాం.. ఇన్ని తప్పులు జరిగాయి: TCA జనరల్ సెక్రటరీ

Updated On : July 10, 2025 / 7:33 PM IST

హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌ (HCA)లో జరుగుతున్న అవినీతిపై సీఐడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి, విజిలెన్స్ కు ఫిర్యాదు చేశానని తెలంగాణ క్రికెట్ అసోసియేష్ (TCA) జనరల్ సెక్రెటరీ గురువారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఇవాళ ఆయన 10టీవీతో మాట్లాడారు.

“నకిలీ పత్రాలతో క్లబ్ ఏర్పాటు చేసి HCAలో పోటీ చేసి జగన్మోహన్ రావు గెలుపొందారు. HCAలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది. ప్లేయర్ సెలక్షన్ లో కూడా డబ్బులు వసూలు చేశారు. శ్రీచక్ర క్లబ్ కోసం నకిలీ పత్రాలు సృష్టించారు. దొంగ సంతకాలు చేశారు.

ప్లేయర్స్ సెలెక్షన్ కోసం తల్లిదండ్రుల దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. BCCI నుంచి ప్రతి ఏడాది 100 కోట్లు నిధులు వస్తున్నాయి. రెండేళ్లలో 170 కోట్ల రూపాయల నిధులు వస్తే వాటిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది.

నిధుల్లో గోల్‌మాల్ జరిగిందని విజిలెన్స్ కి , CID కి ఫిర్యాదు చేశాము. విజిలెన్స్ త్వరతిగతిన విచారణ పూర్తి చేసింది. CID ద్వారా అరెస్ట్ జరిగింది. జగన్మోహన్ రావు కోర్ట్ లో పిటిషన్లు వేసి, అటువైపు ఉన్న న్యాయవాదులకు డబ్బులు ఇచ్చి మ్యానేజ్ చేస్తున్నాడు.

జగన్మోహన్ రావు ఎన్నిక చెల్లదు. కొన్నేళ్లుగా ఎన్నో ఫిర్యాదులు ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. దేశంలో అత్యంత వరస్ట్ క్రికెటర్ అసోసియేషన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఇప్పటికైనా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రక్షాళన జరగాలి. ఇప్పుడు యాక్షన్ లోకి దిగిన తెలంగాణ పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని గురువారెడ్డి చెప్పారు.